Home Cinema Prabhas: 4000 లకు పైగా పెళ్లి ప్రపోజల్స్ ప్రభాస్ కు వచ్చేలా చేసిన చిత్రం ఏంటో...

Prabhas: 4000 లకు పైగా పెళ్లి ప్రపోజల్స్ ప్రభాస్ కు వచ్చేలా చేసిన చిత్రం ఏంటో తెలుసా.?

Prabhas Marriage: పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా మారిన ప్రభాస్ ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ వయస్సు నలభై మూడు సంవత్సరాలు.. అయితే ఆయన వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నప్పటి నుండి అంటే దాదాపు పది సంవత్సరాల నుండి ఆయన పెళ్లి విషయం గురించి ఎన్నో మరెన్నో ప్రస్తావనలు నెట్టింట వైరల్ అవుతూ వచ్చాయి. తన తోటి హీరోలందరూ పెళ్లిళ్లు చేసుకొని ఓ ఇంటి వాళ్లు అవుతున్నప్పటికీ.. ప్రభాస్ మాత్రం ఇప్పటికీ కూడా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ప్రభాస్ అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు సైతం ఎన్నో రోజులుగా ప్రభాస్ పెళ్లి కోసం కాచుకు కూర్చున్నారు.

See also  Mega Family: ఆ స్టార్ హీరోయిన్ ఏ ఆడది చేయలేని పని చేసి మెగా ఇంటికి కోడలు అవుడామనుకుందట.. ఎవరో తెలుసా.?

do-you-know-any-movie-that-made-prabhas-get-four-thousand-marriage-proposals

ఇక మరికొందరేమో సల్మాన్ ఖాన్ లాగా ప్రభాస్ కూడా బ్యాచిలర్ గా మిగిలిపోతాడేమో అన్న భయంతో బాధపడిపోతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంతవరకు నేను పెళ్లి చేసుకోనని ఎక్కడ స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేదు. పెళ్లి విషయం ఎక్కడ ఎత్తుతారోనని ఇంటర్వ్యూలకి చాలా దూరంగా ఉంటాడు ప్రభాస్. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పటికీ ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ఊసు ఎత్తితే అప్పుడు ఇప్పుడు అంటూ చెబుతూ తప్పించుకుంటూనే ఉంటాడు. తప్పతే పెళ్లి వైపు మాత్రం అడుగులు వేయడమే లేదు. గతంలో ప్రభాస్ అనుష్కలు పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు రాగా వీళ్ళిద్దరూ ఆ వార్తలను కొట్టి పడేస్తూ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ తేల్చి చెప్పారు.

See also  Director Shankar: డైరెక్టర్ శంకర్ కూతురు రెండవ వివాహం.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా.?

ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో కూడా ప్రేమలో పడ్డాడంటూ వార్తలు వచ్చాయి. చివరకు అవన్నీ పుకార్లు గానే మిగిలాయి. ఇక మన అసలు విషయంలోకి వస్తే.. ఓ సినిమా వల్ల ప్రభాస్ కు గతంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల పెళ్లి (Prabhas Marriage) ప్రపోజల్స్ వచ్చాయంట. మరి ఆ సినిమా ఏంటో తెలుసా.? మరి ఆ చిత్రం ఏదో కాదు దర్శక ధీరుడు రాజమౌళి నిర్మించినటువంటి బాహుబలి.. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ డబుల్ యాక్షన్ హీరోగా నటించగా అనుష్క, తమన్నా లు హీరోయిన్లుగా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది.

See also  Victory Venkatesh: ఆర్తీ అగర్వాల్ ని అంత ఇష్టపడిన వెంకటేష్.. అప్పట్లోనే ఆమె కోసం ఏం చేశాడో తెలుసా .??

do-you-know-any-movie-that-made-prabhas-get-four-thousand-marriage-proposals

టాలీవుడ్ ను చిన్న చూపు చూసిన వారంతా బాహుబలి దెబ్బకు గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఇక ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ప్రభాస్.. ఇక ఈ చిత్రం అనంతరం అనేక రాష్ట్రాల, దేశ, విదేశాల నుంచి నాలుగు వేలకు పైగా పెళ్లి ప్రపోసల్ వచ్చాయట.. కానీ ప్రభాస్ వాటిలో ఏ ఒక్కటి కూడా అంగీకరించలేదట. కాగా ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాలైన సలార్, ప్రాజెక్టు కే చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాలు కాకుండా సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్.. మారుతీతో ఓ చిత్రానికి కూడా కమిట్ అయ్యాడట..