Kasthuri Shankar: ఎవరి వ్యక్తిగత జీవితంలోకైనా తొంగి చూడొద్దిని ‘లా’లోనే ఉంది. ఈ చిన్న విషయం లాయరమ్మ మరిచిపోయిందా? లేక కావాలనే ఈ పని చేసిందా? అని కస్తూరి శంకర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇటీవల ఆమె ఒక వీడియోను ట్వీట్ చేసింది. అందులో ఇద్దరు అమ్మాయిలు మద్యం దుకాణం వద్ద మద్యం కొంటున్నట్లు కనిపించింది. దీన్ని ట్వీటర్ లో పెట్టి రచ్చ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. వెండితెరపై అన్నమయ్య లాంటి సినిమాలు నటించింది కస్తూరి శంకర్. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే ‘గృహలక్ష్మి’ డెయిలీ సీరియల్ లో చేస్తూ అటు వెండితెరపై నటిగా ఇటు బుల్లితెర పై నటిగా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
కస్తూరి (Kasthuri Shankar) సినిమాలు, సీరియల్స్ తో చాలా బిజీగా ఉంది అమ్మడు. వీటితో పాటు సోషల్ మీడియాను కూడా అప్పుడప్పుడూ టచ్ చేస్తుంది. ఆమె టచ్ చేసినప్పుడల్లా ఏదో ఒక సంచలన విషయాలను పెట్టి ట్రోల్స్ కు గురవుతుంది. సామాజికవేత్త, న్యాయవాది, పొలిటికల్ అనలిస్ట్ ఇలా అనేక రకాలుగా గుర్తింపు సంపాదించుకున్న కస్తూరి ఇద్దరు అమ్మాయిల పర్సనల్ లైఫ్ కు సంబంధించి వీడియో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇక, ఈ వీడియోలో ఏముందంటే.. ఇద్దరు అమ్మాయిలు మద్యం దుకాణంలో మద్యం కొంటున్నట్లు ఉంటుుంది. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘బాగా తాగండి అమ్మాయిలు..’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
ఇది వాట్సప్ ఫార్వర్డ్ వీడియో అని కూడా స్పష్టం చేసింది. ఇది చూసిన నెటిజన్లు కస్తూరి శంకర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది అమ్మాయిల వ్యక్తి గత విషయం కదా నువ్వెందుకు షేర్ చేస్తున్నావు? అంత అవసరమేముంది? అంటూ మండిపడుతున్నారు. దీనికితోడు సింగర్ చిన్మయి కూడా ఇలానే రియాక్ట్ అయ్యింది. నిజాయితీగా చెప్పాలంటే ఈ వీడియో షేర్ చేయద్దు. ఈ విషయంలో కస్తూరిని నేను హేట్ చేస్తున్నాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియోకు నువ్వు పెట్టిన క్యాప్షన్ ను బట్టి మందు తాగడానికి ప్రోత్సహిస్తున్నావా? లేక వ్యతిరేకిస్తున్నావా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సెలబ్రిటీల ఇళ్లల్లో కూడా పార్టీల పేరుతో మందు తాగితే ఇలా వీడియోలు తీసి..
షేర్ చేసే దమ్ముందా? అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. అయినా అమ్మాయిలు మందు తాగడం లేదని కేవలం కొనుక్కొని మాత్రమే వెళ్తున్నారని, ఇంట్లో వారి కోసం కావచ్చు, మీరు ఎలా అనాలసిస్ చేస్తారు? అంటూ ప్రశ్నించిన వాళ్లు లేకపోలేదు. ఏది ఏమైనా ఈ వీడియోను చూసి వదిలేయాలే కానీ, ఇలా షేర్ చేయడం ఏ మాత్రం మంచిది కాదని. ఇక తాను సెలబ్రెటీ కావడంతో ఆమెను ఎక్కువ మంది ఫాలో అవుతారని ఎక్కువ మంది ఈ వీడియోను చూస్తే వారు బయట ఎలా తిరగగలరని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈమెపై విరుచుకుపడుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.