NTR : సీనియర్ ఎన్టీఆర్ కి మనవడుగా.. జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలోనే సినిమా రంగంలో అడుగుపెట్టి.. తాత పేరు నిలబెట్టే వారసుడని అప్పుడే అనిపించేలా అద్భుతంగా నటించిన బాలనటుడుగా నిలబడి.. ఆ తర్వాత ( NTR reveals he likes that actress ) స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యి.. గ్లోబల్ హీరో స్థాయికి చేరిన జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులందరికీ ఎంత అభిమానమో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ సినిమాలు ఎప్పటికప్పుడు నందమూరి అభిమానుల్ని ఎలా సంతృప్తి పరచాల అనే విధంగానే కొత్తదనంతో రూపొందుకుంటాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో కూడా మంచి మంచి రోల్స్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి దేవర అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ సినిమాపై ( NTR reveals he likes that actress ) నందమూరి అభిమానులను భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటూ.. ఎన్టీఆర్ గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ చాలా మంది హీరోయిన్లతో నటించిన విషయం మనందరికీ తెలిసిందే.. అందులో ఒక హీరోయిన్ ఆయనకు చాలా స్పెషల్ అంట.
జూనియర్ ఎన్టీఆర్ ఎంతమంది హీరోయిన్లతో నటించినప్పటికీ.. ఒక హీరోయిన్ అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. ఈ విషయాన్ని ఆయన తన భార్యతో కూడా చెప్పాడంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. నిత్యామీనన్. నిత్యామీనన్ నటనంటే ఆయనకి చాలా ఇష్టమంట. మహానటి సావిత్రి తర్వాత అంత నేచురల్ గా నటించే ఆమె నటనంటే చాలా ఇష్టమని చెప్పాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో సమంత మొదటి హీరోయిన్ ( NTR reveals he likes that actress ) అవ్వగా నిత్యామీనన్ రెండో హీరోయిన్ గా చేసింది. ఏ హీరోయిన్ తో అంత చనువుగా మాట్లాడే అలవాటు లేని ఎన్టీఆర్.. నిత్యామీనన్ తో మాత్రం జనతా గ్యారేజ్ షూటింగ్లో చాలా క్లోజ్ గా మాట్లాడేవాడు అంట. ఆమె నటన అంటే చాలా ఇష్టం అంట. అలాగే ఆ సినిమా ప్రమోషన్ గురించి వెళ్లినప్పుడు కూడా ఎన్టీఆర్ కొన్ని విషయాలు చెప్పాడు.
నిత్యమీనన్ సింపుల్ నటనంటే తనకి చాలా ఇష్టమని.. ఆమెతో కలిసి నటించే అవకాశం ఇంకోసారి వస్తే ఖచ్చితంగా నటిస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి తో కూడా ఆ అమ్మాయి నటన నాకు చాలా బాగా నచ్చుతుంది. చాలా న్యాచురల్ గా, సింపుల్ గా నటిస్తుంది అని పొగడాడంట.. దానితో ఉడికిపోయిన లక్ష్మీ ప్రణతి ఒక్కసారిగా విసుక్కుందంట. అయినా కూడా వాళ్ళ ఆవిడ అలా చేస్తుంటే ఇంకా ఆనందంగా నవ్వుకుంటూ ఆపలేదంట. ఇలా నిత్యామీనన్ ఎన్టీఆర్ దగ్గరనుంచి అంత గొప్ప పొగడ్తని పొందడం నిజంగా నిత్యామీనన్ అభిమానులకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా మా హీరో నటనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు.. సింపుల్గా ఉండే హీరోయిన్ ఆమెను నటనని ఇష్టపడ్డాడు తప్పా.. హంగులతో, ఎక్సపోజ్ చేసే హీరోయిన్స్ ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకుంటున్నారు..