Home Cinema NTR-Mahesh Babu: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేశ్ బాబు.. అదేంటంటే?

NTR-Mahesh Babu: ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేశ్ బాబు.. అదేంటంటే?

NTR-Mahesh Babu: ఒక హీరోతో చేయాలనుకున్న సినిమా మరో హీరోతో చేస్తే. అందునా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఇక ఆ సినిమాను వదులుకున్న హీరో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అతడు’ సినిమా కథను పవన్ కళ్యాణ్ కోసం రానుకున్నాడు. కానీ ఆయన ఇంట్రస్ట్ చూపకపోవడంతో అది కాస్తా మహేశ్ బాబుతో తీశాడు. ఇంకేముంది ఆ సమయంలో టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ హిట్ కొట్టింది ఈ సినిమా (Mahesh Steals NTR Movie). అదే విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీయాల్సిన సినిమాను మహేశ్ బాబు ఎగరేసుకుపోయాడు. దీంతో అది బ్లాక్సాఫీస్ హిట్ కొట్టింది. దాని గురించి తెలుసుకుందాం.

See also  Nagarjuna: అమల పక్కనే ఉన్నా టబుతో నాగార్జున చిలిపి పనులు.. కోపంలో అమల..!!

mahesh-babu-ntr

ప్రస్తుతం ఫ్లాప్ లేని హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయన ఇటీవల తీసిన అన్ని సినిమాలు హిట్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తవ్వగానే టాలీవుడ్ జక్కన్న రాజమౌళితో ఒక భారీ సినిమా తీయబోతున్నారు మహేశ్ బాబు. దీనికి సంబంధించిన కథను ఇప్పటికే దర్శకుడికి అందించారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి (Mahesh Steals NTR Movie). వచ్చే సంవత్సరం షూటింగ్ ప్రారంభించనున్నారు.

See also  Star Hero: ఆ స్టార్ హీరోకి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా.? ఇలా దొరికిపోయ్యడేంటి..

mahesh-babu-steals-ntr-movie

ఇవన్నీ పక్కన పెడితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు ఒక సినిమాలో నటించారు. ఆ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. ఇది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి, రావు రమేశ్, సంగీతతో పాటు మరికొంత మంది నటించారు. మహేశ్ బాబుకు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన నటించింది. 2020 సంక్రాతి కానుకగా రిలీజై వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా వెనుకున్న కథ గురించి చాలా మందికి తెలియదు. ఆదేంటంటే.. కళ్యాణ్ రామ్ తో పటాస్ చేస్తున్న సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు కథను సిద్ధం చేసుకున్నారట.

See also  RRR Oscar Award: నాటు నాటు పాటకి ఎలాంటి ఆస్కార్ అవార్డు వచ్చిందో తెలుసా?

ntr-mahesh-babu

ఈ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీయాలని అనుకున్నారట. కథను వినిపించగానే ఎన్టీఆర్ కూడా ఒకే అనేశారట. అయితే అప్పటికే రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ కమిట్ కావడంతో డేట్స్ అడ్జెట్ చేయలేకపోయారట. ఈ మూవీ తర్వాత తీద్దాం అని అనిల్ తో చెప్పారట. అంతలో మహేశ్ బాబు నుంచి కాల్ రావడంతో ఇదే కథను అటు షిఫ్ట్ చేశారట అనిల్ రావిపూడి. ఈ విషయన్ని ఎన్టీఆర్ కు చెప్పగా ఆయన కూడా ఒకే అన్నారట. దీంతో యంగ్ టైగర్ తో తీయాల్సిన సినిమాను సూపర్ స్టార్ తో తీశాడు దర్శకుడు.