Home Cinema Srinidhi Shetty: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న కెజిఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. షాక్ లో...

Srinidhi Shetty: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న కెజిఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. షాక్ లో ఫాన్స్..

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి గురించి యంగ్ జనరేషన్ కు పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా చేసిన ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వందలాది మంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వస్తే ఎవరో ఒక్కిరికి మాత్రమే ఈ ఛాన్స్ దక్కుతుంది. అంత సుడి ఉన్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) నుంచి వచ్చిన శ్రీనిధి శెట్టి హీరో యష్ తో కలిసి కేజీఎఫ్ లో నటించింది (Srinidhi Shetty Marriage). ఈ సినిమాకు సంబంధించి ఆమెకు ఫుల్ పాజిటివ్ మార్కులు పడ్డాయి. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది శ్రీనిధి.

See also  Childhood Photo: ఈ ఫోటో లో క్యూట్ గా కనిపిస్తున్న పాప తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం..

srinidhi-shetty

కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లో శ్రీనిధి నటనకు యంగ్ జనరేషన్ దాసోహం అయ్యింది. కానీ ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. పాన్ ఇండియా మూవీ చేసిన హీరోయిన్ కు అవకాశం దొరకకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల సీక్రెట్ గా పెళ్లి చేసుకుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె పెళ్లి అయ్యిందని, అందుకే ఆమె పాపిట్లో బొట్టు ఉంది అన్న వార్తలు వినిపించాయి (Srinidhi Shetty Marriage). చాలా సంప్రదాయాల్లో వివాహం చేసుకున్న మహిళ పాపిటలో బొట్టు పెట్టుకుంటుంది. ఇదే మాదిరిగా శ్రీనిధి శెట్టి కూడా బొట్టు పెట్టుకుంది. ఇదేదో సినిమా కోసం కాదు.

See also  Rashmika Mandanna : రష్మిక ప్రతీ సినిమాకి రెమ్యునిరేషన్ పాటు అది కూడా అడుగుతాదట.. మామూలుది కాదు..

srinidhi-kgf-heroine

తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫొటోలో కనిపించింది. కాబట్టి ఆమెకు పెళ్లి అయ్యిందన్న వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆమె ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారట. అయితే ఆమె కుటుంబం గురించి తెలిసిన కొంత మంది ఆమెకు వివాహం కాలేదు. ఆమె కుటుంబ సంప్రదాయం ప్రకారం వివాహం కాకున్నా పాపిటలో బొట్టు పెట్టుకుంటారు. ఇది వారికి అనాధిగా వస్తున్న ఆచారం అంటూ చెప్తున్నారు. ఆమె వివాహం చేసుకోలేదని, ఇది కేవలం ఆచారం మాత్రమే అంటూ కామెంట్లకు రిప్లయ్ లు కూడా ఇస్తున్నారు. దీంతో ఆమె ఫ్యాన్స్ కొంత ఊపిరి తీసుకున్నారు.

See also  Victory Venkatesh: ఆర్తీ అగర్వాల్ ని అంత ఇష్టపడిన వెంకటేష్.. అప్పట్లోనే ఆమె కోసం ఏం చేశాడో తెలుసా .??

actress-srinidhi-shetty

ప్రస్తుతం ఆమె చేతిలో ఆశించిన మేర ప్రాజెక్టులు లేవు. పాన్ ఇండియా హీరోయిన్ కావడంతో రెమ్యునరేషన్ విషయంలో ప్రొడ్యూసర్స్ భయపడుతున్నారంటూ కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలో పుకార్లు వస్తున్నా. అవేవీ నిజం కాదని ఆమె ఫ్యాన్స్ చెప్తున్నారు. మంచి ప్రాజెక్ట్ అది కూడా పాన్ ఇండియా లెవల్ అయితే చేస్తుంది కాబోలు. కానీ ఇన్ని రోజులు కాలీగా ఉంటే ఫేడ్ అయ్యే ప్రమాదం ఉందని కూడా ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.