Rashmika: సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి వెళ్తారో ఎవరు ఎప్పుడు ఏ స్థాయి నుంచి కిందకు దిగుతారో చెప్పలేము.. ఏ రంగంలో నైనా అంతేగాని సినిమా ఇండస్ట్రీలో మరి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది శ్రమతో కూడినదే అయినా కూడా గ్లామర్ తో కూడినది ఇంకా చెప్పాలంటే సమయం స్ఫూర్తితో కూడినది అని కూడా చెప్పుకోవచ్చు. రష్మిక చలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె, మొదటి సినిమాతోనే మంచి హిట్టుని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోలతో నటించేసింది. ( Rashmika Bollywood Offers )
నాగశౌర్యతో తన మొదటి సినిమానే చేసిన రష్మిక తర్వాత అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలతో కూడా నటించేసింది. అన్నిటికంటే విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన గీత గోవిందం ఆమె కెరీర్ ను మార్చేసింది. అద్భుతమైన ఆమె నటన ఆ సినిమాలో ఎంతగానో మెప్పించి. ఆమెకు మంచి క్రేజ్ ని రేంజ్ ని కూడా తీసుకొని వచ్చింది. ఇక పుష్ప సినిమాతో ఆమె స్థాయి ఎక్కడకో వెళ్ళిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలిగింది. పుష్ప సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు విపరీతంగా వచ్చాయి. అయితే బాలీవుడ్ కు వెల్లాలని అక్కడ హీరోయిన్ గా నిలబడాలని మన తెలుగు హీరోయిన్స్ చాలా మంది ట్రై చేస్తారు.
కష్టపడి ఒకటి రెండు అవకాశాలు తెచ్చుకున్న కూడా వాళ్ళు అక్కడ హీరోయిన్స్ ని ఎదుర్కొనే నిలబడడం చాలా కష్టమే.. అయితే రష్మిక కూడా పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత బాలీవుడ్ లో వచ్చిన అవకాశాన్ని చే జిక్కించుకుంది. కానీ ఆమె చేసిన మొదట చేసిన ఒకటి, రెండు సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. అంతగా క్రేజ్ ఏమీ రాలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో ఆమెకు విపరీతంగా ఆఫర్స్ అయితే మాత్రం వస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ గా ఆమెకు అనేక ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. దీనికి కారణం ఏమిటని అందరు ఆలోచిస్తున్నారు.. దీనికి కారణం ఒకటే ఆమె సమయస్ఫూర్తి. ( Rashmika Bollywood Offers )
బాలీవుడ్ లో అవకాశాలు దొరుకుతున్నాయి.. అనగానే మాకు క్రేజీ పెరిగిందని వాళ్ళు రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కి రారు. కొందరు హీరోయిన్స్ దాని వలన వారిని వదిలేసి వేరే హీరోయిన్స్ కోసం పరుగులు పెడతారు సినీ నిర్మాతలు.. ఎందుకంటే ఎక్కడ ఎంత బడ్జెట్ తగ్గించుకుంటే సినిమా మీద అంత రిస్క్ తగ్గుతుందని వాళ్ల తాపత్రయం. అలాగే రష్మిక కూడా మేకర్స్ ఏమైనా రెమ్యూనిరేషన్ తగ్గించమంటే తనకి ఒక వేళ ఆ ప్రాజెక్టు నచ్చితే వెంటనే రెమినేషన్ తగ్గిస్తుంది అంట. డబ్బు విషయంలో అంత గట్టిగా ఉండదంట. అందుకే ఆమె కెరీర్ విషయంలో ఎటువంటి లోటు లేకుండా ముందుకు సాగిపోతుంది. ఈ విషయంలో రష్మిక తెలివితేటల్ని నిజంగా మెచ్చుకోవచ్చు. ఇదే సమయం సమయస్పూర్తి అంటే ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచన మనిషికి సక్సెస్ వైపు నడిపించే అవకాశాన్ని సృష్టిస్తుంది.