Home Cinema Bro movie business : బ్రో తో భయపడుతున్న బయ్యర్స్.. అసలు కారణం అదంట!

Bro movie business : బ్రో తో భయపడుతున్న బయ్యర్స్.. అసలు కారణం అదంట!

pawan-kalyan-bro-movie-business-is-good-but-buyers-are-in-tension

Bro movie business : ఈరోజుల్లో ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలతో.. జాగ్రత్తగా సినిమా తీసుకొని మన భాషలో హిట్ చేసుకోవాలని దర్శకులు నిర్మాతలు హీరోలు కూడా ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. అదే క్రమంలో తమిళంలో ( Pawan Kalyan Bro movie ) సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ్య సీతమ్ సినిమాని తెలుగులో బ్రో సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా, సాయిధర్మతేజ్ పవన్ కళ్యాణ్ హీరోలుగా.. ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ నెలాఖరికి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సాయిధరమ్ తేజ్ విరూపాక్షతో మంచి హిట్టు కొట్టి అదే స్పీడ్ లో ఇది కూడా కొడతాడని అందరూ అనుకుంటున్నారు.

See also  Dhootha Trailer Review : దూత ట్రైలర్ రివ్యూ.. మరి ఆ సీన్స్ లేకుండా..

pawan-kalyan-bro-movie-business-is-good-but-buyers-are-in-tension

ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ అయితే బాగానే జరిగింది. బయ్యర్లు దాదాపుగా 125 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టుగా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా కొనుగోలు చేసిన బయ్యర్లు కొనేసిన తర్వాత భయపడుతున్నారంట. ఇంతకీ అసలు సంగతేమిటంటే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నది చాలా ( Pawan Kalyan Bro movie ) తక్కువ టైమ్ అంట. 40 నుంచి 50 నిమిషాలు కూడా ఉండకపోవచ్చు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను 100 కోట్లు పెట్టి కొనినా పర్వాలేదు కానీ.. పవన్ కళ్యాణ్ ఎంతోసేపు లేని సినిమాకి అంటే ఆ సినిమాలో మెయిన్ హీరో సాయిధర్మతేజ అవుతాడు కదా.. సాయి ధరంతేజ్ సినిమాని వంద కోట్లు పైన కొనడం అంటే భయపడుతున్నారు.

See also  Baby : బేబీ సినిమాలో అదిరిపోయే ఆ సీన్స్ మళ్ళీ చూస్తారా.. రండి చూద్దాం..

pawan-kalyan-bro-movie-business-is-good-but-buyers-are-in-tension

దీనితో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించే సమయం ఆడియన్స్ సాటిస్ఫై చేయకపోతే.. పవన్ కళ్యాణ్ కనిపించే టైంలో అతనికి సరైన పవర్ ఇవ్వకపోతే.. ఆ సినిమా ఆడదని, కేవలం సాయిధర్మతేజనే దృష్టిలో పెట్టుకొని సినిమా ( Pawan Kalyan Bro movie ) ఆడియన్స్ చూడలేరు అని.. అలా చూడకపోతే ఇన్ని కోట్లు నష్టపోతామని.. బయర్స్ విపరీతంగా భయపడుతున్నారట. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఒక నెల రోజులు కూడా కాల్షీట్ డేట్స్ ఇవ్వలేదని అంటే.. అతనుకు చాలా తక్కువ సమయం, తక్కువ యాక్షన్ ఉంటుందని అనుకుంటున్నారు. బ్రో సినిమా అనగానే సినీ అభిమానులందరికీ పవన్ కళ్యాణ్ గుర్తొకొస్తాడు.. ఇక పవన్ అభిమానులైతే భయంకరంగా తమ హీరోని మంచి క్యారెక్టర్ లో చూద్దామని పరుగులు తీస్తారు.

See also  Mrunal Thakur: రూ.3 కోట్ల కోసం అలాంటిపని చేసిన మృణాల్..?? ఛీ..ఛీ.. మరి ఇంత బరితెగించేసిందా...!!

pawan-kalyan-bro-movie-business-is-good-but-buyers-are-in-tension

అలాంటి క్రమంలో ఇది సాయి ధరంతేజ్ సినిమా అనుకోవాలా ?పవన్ కళ్యాణ్ సినిమా అనుకోవాలా? అనేది అర్థం కాకుండా 125 కోట్ల బిజినెస్ చేసేసాము.. ఇప్పుడు ఎలా రిటర్న్స్ వస్తాయని భయపడుతున్నారంట బయ్యర్స్. అయితే ఇటీవల రిలీజ్ అయిన బ్రో సినిమాలో పాట పెద్దగా అట్రాక్ట్ చేసుకోలేకపోయింది. అంతేకాకుండా ఇలాంటి భయాలను చూసి.. సినిమా అనేది బాగుంటే అందులో ఎవరు ఎంత సేపు ఉన్నా.. సినిమాను బానే చూస్తారని కొంతమందిని నెటిజనులు అంటున్నారు. సామజవరగమన సినిమాలో హీరో ఎవరు? ఆ హీరోకి సాయిధరమ్ తేజ్ తేడా ఏముంది? కాబట్టి సినిమాలో కంటెంట్ బాగుంటే.. పవన్ కళ్యాణ్ ఎంతసేపు కనబడిన సినిమా బాగానే సక్సెస్ అవుతుందని.. భయపడాల్సిన అవసరం లేదని కొందరు నెటిజనులు అంటున్నారు.