Taapsee: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఝుమ్మంది నాదం అనే చిత్రంతో పరిచయమైంది ఈ ఢిల్లీకి చెందిన చిన్నది తాప్సీ పన్ను. ఇక తన చిన్నతనం నుండే మోడలింగ్ మీద ఇష్టంతో ఇంట్లో వాళ్ళను కాదనలేక తన చదువును పూర్తి చేసి బాలీవుడ్ లో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేసింది.కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ అవకాశాలు మాత్రం అందలేదు. అలా ఇండస్ట్రీలంతటా అవకాశాల కోసం అంతటా తిరగగా 2010వ సంవత్సరంలో రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన చిత్రం ఝుమ్మంది నాదంలో హీరోయిన్ గా అవకాశాన్ని కొట్టి తన అదృష్టం పరీక్షించుకుంది. అలా తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుని ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్ గా రానిస్తూ నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మిస్తూ అక్కడే సెటిల్ అయ్యింది.
సినిమా ఇండస్ట్రీ ఓ పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచంలో ప్రేమలు, పెళ్ళిళ్ళు, డేటింగ్ లు చాలా కామన్ సెలబ్రెటీలకు.. ఈ సెలబ్రెటీలలో ఎవరి గురించి మాట్లాడుకున్నా వాళ్ళ జీవితాలలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక లవ్ స్టోరీలు అనేవి ఉంటాయి. అలాంటిదే తాజాగా నెట్టింట ఓ వార్త తాప్సీ పన్ను గురించి ఆమె ఇంతమందితో ప్రేమయణాన్ని కోనసాగించిందా అంటూ ఓ వార్త ఐతే వైరల్ గా మారింది. మరి తాప్సీ ఎంత మందితో ప్రేమాయణాన్ని నడిపించిందో ఇప్పుడు తెలుసుకుందాం. తన మొదటి చిత్రం ఝుమ్మంది నాదం లో నటిస్తున్న సమయంలో మనోజ్ తో తాప్సీకి మధ్య ఏదో కొనసాగుతుందని కొంత మంది యూట్యూబ్ లో థంబ్ నేయిల్స్ క్రియేట్ చేసి మరీ వీళ్ళిద్దరి మధ్య ఏదో కొనసాగుతుందని వైరల్ చేశారు.
అప్పుడు జరిగిన సంఘటన ఆ విషయం గురించి ఇటీవల ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ అసలు మా మధ్య అలాంటిదేమీ లేదు అప్పట్లో ఆ వార్తలు వైరల్ చేయడం ద్వారా మేమిద్దరం చాలా నవ్వుకున్నామంటూ వెల్లడించాడు. ఆ తర్వాత తాప్సి కోలీవుడ్ లో నటిస్తున్న సమయంలో హీరో ఆర్యతో ప్రేమలో పడి రెండు సంవత్సరాలు వీళ్లిద్దరూ డేటింగ్ లో చేశాక వాళ్ళిద్దరి మధ్య ఏవేవో మనస్పర్ధలు కారణంగా బ్రేకప్ చెప్పుకొని విడిపోయారంట.. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదట్లో అక్షయ్ కుమార్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వరుసగా అతనితో మూడు చిత్రాల్లో నటించేసరికి బాలీవుడ్ టౌన్ లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తెగ చక్కర్లు కొట్టింది. కానీ ఆ తర్వాత అది కేవలం చిత్రాల కొరకు ఏర్పరచుకున్న సాహిత్యంగా మాత్రమే అని బయటపడడంతో అక్కడితో ఆ వార్తలు ఆగిపోయాయి.
ఇక ఆ తర్వాత తాప్సి సీక్రెట్ గా మోహిత్ రాఘవేంద్ర తో కొన్ని రోజులు డేటింగ్ కొనసాగించిందట.. కానీ అతగాడు సినీ ఇండస్ట్రీలో అంతగా లేకపోవడంతో అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ నటుడు సంకీ సలీం తో కూడా చాలా మంచి బంధం ఏర్పరచుకుందట కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం స్నేహ బంధమా లేక ప్రేమ అనే విషయం ఇప్పటివరకు పరిచయం కాలేదట.. ఇతగాడి తర్వాత తాప్సి బ్యాట్మెంటన్ ప్లేయర్ అయిన మాథియాసస్ బోయ్ అనే వ్యక్తితో కొద్ది రోజుల పాటు డేటింగ్ చేసిందట.. అతను ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఏకంగా మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అడిగితే తాప్సి అని తన పేరును బయటపెట్టాడు. దాంతో మరొకసారి వీళ్లిద్దరి మధ్య ఉన్న బంధం గురించి యూట్యూబ్లో థంబ్నెల్స్ లో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మాథియాసస్ బోయ్ తాప్సి (Taapsee) ప్రేమలో ఉన్న విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడంతో.. త్వరలో వీళ్ళ జంట పెళ్లి పీటలేకపోతున్నట్లు మనకు తెలుస్తుంది.