Akhil – Sri Vishnu : ఈ ఏడాది మాత్రం భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు భారీగానే ముంచేసాయి. చిన్న చిన్న బడ్జెట్ తో తీసిన సినిమాలు ఎంతో పెద్ద మనసుతో నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను కాసాయి అని చెప్పుకోవడంలో ఆలోచించాల్సిన ( Samajavaragamana good results than Agent ) పని లేదు. ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు బలగం ఇలాంటి సినిమాలు ఎంతో మంచి రిజల్ట్ ఇచ్చి.. పెట్టిన దానికంటే ఎంతో ఎక్కువ డబ్బుని తీసుకొచ్చాయి. కానీ భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు శాకుంతలం, ఆదిపురుష్ ఇలాంటి సినిమాలు డిజాస్టర్ గా మారి భారీ నష్టాన్ని తెచ్చాయి. ఈ సినిమాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు ఎప్పటికి తేరుకుంటారో ఎవరికి తెలియదు.
ఇదిలా ఉంటే ఇటీవల రిలీజ్ అయిన శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా సామజవరగమన మంచి రిజల్ట్ తీసుకొచ్చింది. ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో కూడా ఎవ్వరూ పెద్దగా చూడలేదు. అసలు ఇది ఒక సినిమా ఉందని, ఈ సినిమా ( Samajavaragamana good results than Agent ) బాగుంటుంది అని కూడా ఎవరు ఊహించలేదు. మొదటి రెండు రోజులు ఎదో సరదాగా చూసిన వాళ్ళు చెప్పిన మాటలతో.. వచ్చిన రివ్యూలకి ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నిజంగానే ఈ సినిమా చూసి అందరూ ఎంతో రిలాక్స్ గా ఫీల్ అయ్యారు. చాలా రోజులు తర్వాత సరదాగా నవ్వుకునే సినిమా వచ్చిందని ఆనందించారు. ఎప్పుడైతే ఈ సినిమా బాగుందని వార్త బయటకు వచ్చిందో కుటుంబ సమేతంగా అందరూ ఈ సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు.
ఒక కొత్త పాయింట్ పట్టుకొని దాన్ని సరదాగా అలా నడిపించుకుంటూ సినిమాని వెళ్లిపోయాడు దర్శకుడు. తన తండ్రి డిగ్రీ పాస్ అయితే తన ఆస్తి వస్తుందని ఆలోచనతోనే కాకుండా.. తన తండ్రి ఓడిపోవడం చూడలేని కొడుకుగా పాయింట్ రాసుకొని.. అదొక్కటే కాకుండా దానికి తోడుగా కామెడీ కోసం ప్రేమించిన అమ్మాయి వరస మారిపోతుందనే టెన్షన్లో.. ఇక చుట్టూ ఉన్న ( Samajavaragamana good results than Agent ) వాళ్ళ కామెడీతో ఎంతో అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇలాంటి సినిమాలు తక్కువ డబ్బు ఖర్చుతో.. ఎక్కువ లాభాన్ని, ఎక్కువ ఆనందాన్ని తెచ్చిపెట్టే ఆలోచనలు ఎంత ఎక్కువగా వస్తే అంత బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. ఎంత భారీ బడ్జెట్లో సినిమా తీస్తే అంత హిట్ అవుతుందని అనుకోవడం ఒకరకంగా తప్పేమో అని కూడా అనిపించేలా ఉంటుంది రిజల్ట్స్ చూస్తుంటే..
ఇక సామజవరగమన సినిమా కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ థియేటర్ రైట్స్ 3 కోట్ల 20 లక్షలకు అమ్మితే.. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజులకి అన్ని ప్రాంతాలు కలిపి ఐదు కోట్ల యాభై లక్షలు రూపాయలు వసూలు చేసింది. ఇక ఐదో రోజు కేవలం 50 లక్షల రూపాయలు మళ్లీ వసూలు చేసింది. మొత్తం అసలు కాకుండా లాభం ఐదు రోజుల్లోనే రిటర్న్ వచ్చేసింది. అలాగే ఓవర్సీస్ 25 లక్షల రూపాయలకు అమ్ముడుపోతే.. లాభం 75 లక్షల రూపాయలు దాటింది. ఇక ఈ సినిమాని AK ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. ఈయన గత చిత్రం ఏజెంట్ డిజాస్టర్ గా అయ్యి భయంకరమైన లాస్ తీసుకొచ్చింది. సుమారుగా ఈయన 40 కోట్లు ఆ సినిమా పేరుతో నష్టపోయారు. ఆ మొత్తం నష్టాన్ని సినిమా పూడ్చలేకపోయినా.. ఎంతో కొంత బీడు భూమిలో మొక్క మొలకెత్తినట్టు ఉపయోగపడుతుంది. దీనితో నిటిజనులందరూ కూడా అఖిల్ మిగిల్చిన బీడు భూమిని సస్యశ్యామలం చేస్తున్న శ్రీ విష్ణు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.