Home Cinema Mahaveerudu trailer review : భయమంటూ భీబత్సమ్ సృష్టియించిన శివకార్తికేయన్!

Mahaveerudu trailer review : భయమంటూ భీబత్సమ్ సృష్టియించిన శివకార్తికేయన్!

sivakarthikeyan-movie-mahaveerudu-trailer-review

Mahaveerudu trailer review : శివకార్తికేయన్ హీరోగా, అదితి శంకర్ హీరోయిన్ గా మహా వీరుడు సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాల ఏర్పడుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ దర్శకుడు ( Sivakarthikeyan movie Mahaveerudu trailer ) మండేలా అనే సినిమాతో జాతీయ అవార్డును సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో సునీల్, యోగి బాబు మొదలగువారు వారు ప్రధాన పాత్రలలో కూడా ఉన్నారు. అదితి శంకర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది. ఇందులో శివకార్తికేయన్ నటన చాలా సూపర్ గా ఉందని.. సినిమా సూపర్ హిట్ అవుతుందని.. యూట్యూబ్లో ట్రైలర్ చూసిన శివకార్తికేయన్ అభిమానులు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

See also  Popular Actress: బాబోయ్ ఇంత మంది ఉన్నారేంట్రా.? పెళ్ళికి ముందే తల్లయిన స్టార్ హీరోయిన్లు..

sivakarthikeyan-movie-mahaveerudu-trailer-review

సినిమా ట్రైలర్ మొదలు సంకెళ్లతో ఒక మనిషిని తీసుకెళ్తున్నట్టు చూపించి.. ఆ తర్వాత హీరో నిలబడితే నలుగురు రౌడీలు చుట్టుముట్టగా.. ఇంటిదగ్గర ఒక అమ్మాయి అమ్మ అన్నయ్య ఎక్కడ? కోపంలో వాళ్ళని కొట్టేస్తాడేమో అని అనడంతో.. స్టార్టింగ్ అందరూ కూడా హీరోకు చాలా కోపం ఏమో.. బాగా ఫైట్స్ చేస్తాడేమో.. అనుకున్నారు కానీ.. మీ అన్నయ్య చించాడు లే అని తల్లి అనడంతో.. హీరో పోస్టర్స్ ఉంచుతాడు. అక్కడి నుంచి రౌడీ ( Sivakarthikeyan movie Mahaveerudu trailer ) నుంచి పారిపోతున్నట్టు పిరికి వాడి లాగా కొంతసేపు చూపించారు. అలాగే తన తల్లితో కూడా నీకు కొంచమైన భయం ఉందా అమ్మ? ఆ కార్యకర్తలతో మనకు గొడవ అవసరమా అంటూ.. హీరో భయపడే కొడుకుగా కూడా చూపించారు. అయితే హీరో మీడియాలో పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.. మహావీరుని మీద ఒక కొత్త కథ రాస్తే బాగుంటుంది అని చెప్పడంతో.. కొత్త కథ అంటూ ఆలోచనలో పడినట్టు చూపించారు.

See also  Bhagavanth Kesari - Leo 3days collection : భగవంత్ కేసరి లియో రెండు సినిమాల మూడవరోజు కలెక్షన్స్..

sivakarthikeyan-movie-mahaveerudu-trailer-review

ఇక హీరో కార్తికేయన్ మహావీరుడి మీద ఒక కథ రాస్తూ.. ఆ కథలో మహావీరుడికి చాలా ధైర్యం ఉన్నట్టు.. యముడే తప్పు చేసినా.. ఎదిరించే గుణం ఉన్నట్టు కథను చిత్రీకరించుకున్నట్టు చూపించారు. అలా చిత్రీకరించుకున్న కథలోకి తానే రాస్తూ.. తనకు తానే అలా ఫీల్ అవుతూ.. విలన్స్ ని ఎదిరిస్తున్నట్టు.. బీభత్సాన్ని సృష్టిస్తున్నట్టు చూపించారు. అలాగే హీరోని, విలన్స్ బాగా చితగ్గొట్టి పడేస్తే ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు ( Sivakarthikeyan movie Mahaveerudu trailer ) పైకి చూసి.. ఆ తర్వాత కిందకు చూసి చుట్టూ ఉన్న వాళ్ళని చితగ్గబాగుతున్నట్టు చూపిస్తున్నారు. ఇక విలన్ దగ్గరికి చిన్న చిన్న రౌడీలు వెళ్లి.. వీడు ఇలాగే నటిస్తాడు అన్నా.. ఆ తర్వాత చితక్కొట్టేస్తున్నాడు అని చెప్పడం కూడా చూపించారు.

sivakarthikeyan-movie-mahaveerudu-trailer-review

ఇక హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ పెద్దగా చూపించకపోయినప్పటికీ.. వాళ్ళిద్దరూ ఈడు జోడు బాగానే ఉన్నట్టు.. కెమిస్ట్రీ కూడా బాగానే కుదురుతుంది అన్నట్టు కనిపిస్తుంది. సినిమాలో ఒక వినూత్నమైన కొత్తదనంతో ఒక కథను తీసుకొని వచ్చి.. దానితో సినిమా తీస్తున్నట్టు అనిపిస్తుంది. హీరో అమాయకుడిగా అలాగే అసాధ్యుడిగా అన్ని రకాలుగా కూడా.. హీరోని అన్ని కోణాల్లోంచి చూపించే తీరు కనిపిస్తుంది. శివకార్తికేయ తన నటనతో ప్రేక్షకుల్ని ఎంత బాగా ఆకట్టుకోగలడో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇలాంటి కాన్సెప్ట్ తో ఇంకెన్ని ఆకట్టుకుంటాడో చూడాలి. సునీల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టే కనిపిస్తుంది. నా అంతట నేను ఏమీ చేయలేదు.. కథ చెప్పింది అలాగా.. అని లాస్ట్ లో హీరో అమాయకంగా చెప్పి పైకి చూడడంతో ట్రైలర్ ముగిసింది. ఇక ట్రైలర్ చూస్తే అందరికీ కూడా సినిమా మీద మంచి ఆసక్తి కలుగుతుంది. చూద్దాం ఈ సినిమా ఎంత రేటింగ్ వస్తుందో..