Venkatesh – Klin Kaara : జూన్ 20వ తేదీన మెగా కుటుంబంలోకి క్లింకార వచ్చింది. ఆ రోజు నుంచి ఇటు సినిమా రంగంలో అటు మెగా కుటుంబంలో మెగా అభిమానుల్లో అందరిలోనూ ఇదే టాపిక్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, దానికి సంబంధించిన ( Venkatesh and Klin Kaara ) వీడియోలు, ఫొటోస్ చూస్తూ ఉండడం జరుగుతుంది. క్లింకార మంగళవారం నాడు తెల్లవారుజామునే మహాలక్ష్మి రూపంగా మెగా కుటుంబంలో అడుగు పెట్టిందని సెలబ్రిటీసు, ప్రముఖులు అందరూ కూడా మెగా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రామ్ చరణ్, ఉపాసనల కూతురు క్లింకార పుట్టిన దగ్గరనుంచి.. ఆమె బారసాల వరకు ఆమె పేరు తెలుసుకోవడం కోసం అభిమానులు ఎంతగానో ఆతృతగా ఎదురు చూశారు.
ఇక బారసాల జూన్ 30వ తేదీన ఎంతో వైభవంగా అత్యంత సన్నిహితులను పిలుచుకొని సంప్రదాయపద్ధంగా చేసుకున్నారు. బారసాల జరిగి నామకరణ మహోత్సవం జరిగిన తర్వాత చిరంజీవి మొదటిసారిగా తన మనవరాలు పేరుని ( Venkatesh and Klin Kaara ) అనౌన్స్ చేయడం జరిగింది. క్లింకార అంటే.. లలితా సహస్రనామాల్లోంచి తీసుకున్న ఒక నామమని.. అది ఎంతో పవిత్రమైనదని..ఆ నామానికి అర్ధం కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో అందరూ కూడా ఎంతో ఆనందించారు. అయితే క్లింకార బారసాల జరుగుతుందని.. అంబానీ కుటుంబం వస్తుందని.. వాళ్ళు బంగారపు ఉయ్యాల గిఫ్ట్ గా ఇచ్చారని అనేక వార్తలు అయితే వచ్చాయి. ఇది చూసి చాలా మంది నిజం అని అనుకున్నారు.
కానీ ఇది నిజమైతే దాని తాలూకా ఫోటోలు బయటికి వస్తాయి కదా.. అలాగే కొన్ని ఆధారాలు చూస్తుంటే అది నిజం కాదని వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. అంబానీ బంగారు పూయాలు ఇచ్చారు అనేది కేవలం పుకారు అని అంటున్నారు. అలాగే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గురించి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వెంకటేష్.. రామ్ చరణ్ కూతురికి ఇచ్చిన ( Venkatesh and Klin Kaara ) గిఫ్ట్ చూసి ఉపాసన షాక్ అయింది అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అప్పుడు అంబానీ అయితే ఇప్పుడు వెంకటేష్ అసలు నిజంగా వాళ్ళు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే.. ఎవరో ఒకరు సోషల్ మీడియా ద్వారా ఆ ఫోటోలు షేర్ అవుతాయి లేదా పబ్లిక్ గా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. అది లేకుండా ఇలా వార్తలు వస్తుంటే అవి రూమర్సే అని అనిపిస్తుంది.
కొందరి నెటిజనులు అయితే ఈ వార్త చూసి నవ్వుకుంటూ.. అప్పుడు అంబానీ ఇప్పుడు వెంకటేష్ వీళ్ళు ఇచ్చిన అద్భుతమైన గిఫ్టులంటూ వచ్చిన.. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. అంత షాక్ అయ్యే గిఫ్ట్ ఇచ్చి ఉంటే.. అది కొద్ది గంటల్లోనో.. రోజుల్లోనో.. ఆ వార్త అఫీషియల్ గా బయటికి ఏమైనా వస్తాదేమో చూడాలి. ఇక వెంకటేష్ సైంధవ సినిమా ప్రిపరేషన్ లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇలాంటి పాత్ర వెంకటేష్ ఇంతకు ముందు ఎప్పుడూ పోషించలేదని అంటున్నారు. శైలేష్ కొలను ఈ సినిమాని దర్శకత్వం వహించగా.. ఈ సినిమా ఒక నవల ఆధారంగా కథ రాసుకున్నారని అంటున్నారు. అవినీతి మరియు అత్యాశతో కూడిన హెల్త్ కేర్ మాఫియా పై వెంకటేష్ చేసే పోరాటమే ఈ సినిమా అని అంటున్నారు.