Home Cinema Sai Pallavi: డాక్టర్ చదవి యాక్టర్ అయిన సాయి పల్లవికి ఇలాంటి ఓ పాడు అలవాటుందని మీకు తెలుసా.?

Sai Pallavi: డాక్టర్ చదవి యాక్టర్ అయిన సాయి పల్లవికి ఇలాంటి ఓ పాడు అలవాటుందని మీకు తెలుసా.?

Sai Pallavi: అప్పుడెప్పుడో 2009వ సంవత్సరంలో ఈటీవీ వాళ్ళు నిర్వహించిన డాన్స్ షో డి ఫోర్ లో మూడో రన్నరప్ గా నిలిచింది సాయి పల్లవి. (Sai Pallavi Habit) ఇక ఆ తర్వాత తాను ఎక్కడా కనిపించలేదు. అయితే సాయి పల్లవి గురించి మనందరికీ తెలిసింది ఎప్పుడంటే మలయాళ చిత్రం ప్రేమమ్ తో అదే విధంగా తెలుగులో కూడా తనే నటించి అందరి ప్రశంసలు ఇక్కడ కూడా పొందింది. ఇక ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా నిలిచింది. ఇక ఆ తర్వాత ఫుల్ టైం హీరొయిన్ గా వరుణ్ తేజ్ సరసన ఫిదా చిత్రంలో భానుమతిగా నటించి ఇక్కడ చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా సాయి పల్లవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ గా నిలిచిపోయింది.

See also  Keerthi Suresh: అనిరుధ్ తో కీర్తి సురేష్ కి ఉన్న రిలేషన్ ఆ వ్యక్తి బయటపెట్టడమే కాకుండా.. పెళ్లి కూడా..

do-you-know-that-sai-pallavi-who-is-a-doctor-read-actor-has-a-bad-habit-like-this

అయితే అప్పట్లో ఇదే పేరు నాటి హీరోయిన్ జయసుధ కు సహజనటి అనే పేరు ఉండేది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు అవకాశాల కోసం ఏ రోల్ చేయడానికి అయినా ఎంతకు ఐనా తెగించడానికి సిద్ధపడుతుంటారు.. కానీ సాయి పల్లవి మాత్రం ఇప్పుడున్న హీరోయిన్లకు పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అది ఎలా అంటే పొట్టి పొట్టి దుస్తులు ధరించకుండా.. ఎలాంటి ఎక్స్ ఫోసింగ్ చేయకుండా.. గ్లామర్స్ పాత్రలకు దూరంగా ఉంటూ.. అసలు మేకప్ లేకుండానే ఎంతో సహజంగా కనిపిస్తూ నటిస్తుంటుంది. ఆ కారణాల చేతనే ఈ మలయాళ బ్యూటీ ని నాచురల్ బ్యూటీ అని తెగ పొగిడేస్తుంటారు. ఇక సాయి పల్లవి ఫేసులో ఎలాంటి మేకప్ వేసుకోకపోయినప్పటికీ ఆమె ఫేస్లో చాలా గ్లో కనిపిస్తుంది.

do-you-know-that-sai-pallavi-who-is-a-doctor-read-actor-has-a-bad-habit-like-this

ఇక ఇప్పటి వరకు సాయి పల్లవి నటించిన సినిమాల విషయానికి వస్తే ఆమె మొదటగా నటించిన సినిమా..ఫిదా ఆ తర్వాత శ్యాం సింగరాయ్, ఎంసీఏ, గార్గి, విరాటపర్వం, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ తదితర చిత్రాల్లో ఆమె నటించి మెప్పించింది. చూడ్డానికి చాలా సింపుల్ గా నాచురల్ గా కనిపించే సాయి పల్లవికి అలాంటి ఓ పాడు అలవాటు ఉందంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్త అయితే వైరల్ అవుతుంది. మరి అసలు ఆ విషయం ఏంటి.. ఆ వైరల్ అవుతున్న వార్త ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీకి వచ్చిన ఏ హీరోయిన్ కైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో మైనస్ అనేది కామన్ గా ఉంటుంది. అలాగే సాయి పల్లవి (Sai Pallavi Habit) విషయంలో కూడా ఓ మైనస్ ఉంది. అది ఏంటంటే..

See also  Rajamouli - Tom Holland : రాజమౌళి కొట్టబోయే నెక్స్ట్ ఆస్కార్ అవార్డు.. ఇంటెర్నేషన్ స్టేజి మీద సంచలనం..

do-you-know-that-sai-pallavi-who-is-a-doctor-read-actor-has-a-bad-habit-like-this

ఆమెకి తెలియకుండానే ఆటోమేటిక్ గా కోపం వచ్చేస్తుందట. ఇక ఆ కోపంలో ఏం చేస్తుందో తనకే తెలియదట. ఒక వేళ ఆ కోపం మరి ఎక్కువైతే మాత్రం చేతిలో ఎంత ఖరీదైన వస్తువు ఉన్నప్పటికీ అది నేలకేసి గట్టిగా కొట్టేస్తుందట అలా చేతిలో ఏ వస్తూ ఉన్న సరే ముక్కలు ముక్కలు కావాల్సిందే అట.. ఈ విషయాన్ని కూడా గతంలో సాయి పల్లవి ఇంటర్వ్యూలో భాగంగా పాల్గొన్నప్పుడు నాకు చాలా కోపం ఎక్కువ అనే విషయాన్ని వెల్లడించింది. దాంతో ఈ విషయం నిజమే అని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవడంతో ఏంటి నాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవికి డాక్టర్ చదివిన యాక్టర్ గా మారిన ఈమెకు ఇలాంటి పాడు అలవాటు ఉందా అంటూ ఆమె అభిమానులే కాకుండా ప్రేక్షకులు సైతం కామెంట్లు చేస్తున్నారు.