Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎన్నో ఏళ్ల వరకు కూడా చెప్పుకునే గొప్ప దర్శకుడు పేరు అంటే అది రాజమౌళి అని సగర్వంగా చెప్పుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉండి ఉండొచ్చు.. అందులో చాలా గొప్ప వాళ్ళు, ట్యాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాజమౌళి అనగానే ( Rajamouli favorite heroine ) ఒక స్పెషల్. ఆయన పేరు వినగానే ఒక వైబ్రేషన్.. ఆయన సినిమా అనగానే ఒక సెన్సేషన్.. ఇలా ఎన్నో విధాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఏలు వెళుతున్న రాజమౌళి అంటే నచ్చని వారు, ఇష్టం లేనివారు, కొంతమంది హీరోలు ఫ్యాన్స్ మాత్రమే ఇష్టమైన దర్శకుడు అని అలాటివి ఏమి లేకుండా అందరి మన్ననలు పొందిన దర్శకుడు.
ప్రతీ హీరో అభిమాని కూడా ఆయనకు అభిమానే. ఎప్పుడు మా హీరోతో ఈ దర్శకుడు చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంత గొప్ప దర్శకుడు రాజమౌళి. ఇక సినిమా రంగంలో ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు అంటే.. ఇతను చిన్నప్పటినుంచి ఎన్నో సినిమాలు కచ్చితంగా చూసే ఉంటాడు. సినిమాలు ఎక్కువగా ( Rajamouli favorite heroine ) చూసే వారికి వాళ్లకంటూ వాళ్లు కూడా ఎవరో ఒకరికి అభిమాని అవుతారు. అలా రాజమౌళికి ఇష్టమైన హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఆయన చాలాసార్లు మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో అని అనగగానే మహానటి సావిత్రి అని వెంటనే చెపుతారు. రాజమౌళికి సావిత్రి అంటే చాలా ఇష్టం అంట. ఆ తర్వాత ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే.. సావిత్రి ప్లేస్ ని సౌందర్య తీసుకుందని అంటారు.
అలాగే సౌందర్య తర్వాత ఆయనకి ఇష్టమైన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే.. నిత్యామీనన్ అంట. నిత్యామీనన్ అంటే రాజమౌళికి చాలా ఇష్టం అంట. ఆమె నటించిన ప్రతి సినిమాని ఆయన చూస్తారంట. కారణం ఆమె చాల నేచురల్ గా నటిస్తాదని, చాలా నేచురల్ గా, సింపుల్ గా ఉంటదని చాలా ఇష్టమంట. అయితే రాజమౌళి ఇష్టాన్ని ( Rajamouli favorite heroine ) సంపాదించుకున్న నిత్యామీనన్కి ఆయన సినిమాలో ఇంతవరకు ఒక చిన్న పాత్ర కూడా దొరకలేదు. దానికి కారణం ఏమిటని అందరూ అనుకుంటున్నారు. రాజమౌళి ఆమెను తీసుకోకపోవడానికి కారణం.. రాజమౌళి తీసే ప్రతీ సినిమా కూడా చాలా కమర్షియల్ గా అన్ని రకాలుగా సినిమాలో ప్రతి పాత్రని పోషించడానికి నటీనటులను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు.
అందువలన నిత్యామీనన్ చూస్తే.. పొట్టిగా, బొద్దుగా ఉంటుంది. ఇలాంటి హీరోయిన్తో మంచి కటౌట్ ఉన్న సినిమా చేయడం రాజమౌళికి కష్టం. ఆయన సినిమా చేసే ప్రతి సినిమాలో హీరోయిన్ ని చాలా పర్ఫెక్ట్ గా ఆ పాత్రకు తగ్గట్టుగా తీసుకుంటారు. ఆయనకు ఇష్టమైన హీరోయిన్ కూడా ఆయన సినిమాలో పెట్టుకోకుండా.. కేవలం ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బుకు న్యాయం చేయడం కోసం.. సినిమా అంటే దాన్ని ఎంతో పవిత్రంగా, మంచి వ్యాపారంగా చూసి ప్రొడ్యూసర్లు కానీ.. డిస్ట్రిబ్యూటర్లు గాని.. రాజమౌళి వలన నష్టపోయారని పేరు ఇంతవరకు తెచ్చుకోకుండా ఉండేలా ఆయన జాగ్రత్త పడుతూ.. ప్రతి నటీనటుల మీద, సీన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. కాబట్టి రాజమౌళికి అంత పేరు వచ్చింది. అందుకే ఆయనకు ఎంత ఇష్టం ఉన్నా ప్రొడ్యూసర్ డబ్బు కోసం నిత్యా మీనన్ ని వద్దనుకున్నారు అని నెటిజనులు అనుకుంటున్నారు. ఎప్పుడైనా పలానా పాత్రకి నిత్యామీననే బాగుంటదని ఆయనకి అనిపిస్తే అప్పుడు తీసుకుంటారేమో చూడాలి..