Home Cinema Chiranjeevi: మనవరాలి బారసాలకి వచ్చినందరికి చిరంజీవి బంగారు కానుకలు.. ఏమిచ్చాడంటే..

Chiranjeevi: మనవరాలి బారసాలకి వచ్చినందరికి చిరంజీవి బంగారు కానుకలు.. ఏమిచ్చాడంటే..

Chiranjeevi Gold Gifts: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ప్రస్తుతం మహర్దశ నడుస్తుంది, అటు సినిమాల పరంగాను, ఇటు వ్యక్తిగతం పరంగాను అంతా శుభమే జరుగుతుంది. సినిమాల పరంగా ఆయన #RRR చిత్రం తో గ్లోబల్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకున్నాడు. మరో పక్క వ్యక్తిగత విషయానికి వస్తే రీసెంట్ గానే పండింటి ఆడ బిడ్డకి జన్మనిచ్చాడు. ఈ పాప పుట్టడం తో కుటుంబం మొత్తం లో పండుగ వాతావరణం నెలకొంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎంత ఆనందం లో ఉన్నాడో మాటల్లో చెప్పలేము, ఆయన ముఖం చూస్తేనే అర్థం అయ్యిపోతాది అది.

See also  Heroine Laya: హీరోయిన్ లయకి అంబానీకి ఉన్న లింక్ తెలుసా.. లయ జీవితంలో అసలు నిజం ఇదా!

chiraanjeevi-gifts-gold-to-guests

ఇక నిన్న తన మనవరాలికి బారసాల కార్యక్రమం నిర్వహించి ‘క్లిన్ కారా కొణిదెల’ అని నామకరణం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ‘క్లిన్ కారా’ అనే పేరు ని లలిత సహస్ర నామాల నుండి తీసుకున్నారు, ఈ విషయాన్నీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపాడు. ఇక బారసాల కార్యక్రమం ని చిరంజీవే స్వయంగా చేయించాడట. ఈ కార్యక్రమానికి బంధు మిత్రులతో పాటుగా, కొంతమంది ఇండస్ట్రీ కి చెందిన వారు మరియు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసారట.

klin-kaara

ఈ శుభకార్యం కి వచ్చిన ప్రతీ ఆడపడుచుకు చీర జాకెట్ తో పాటుగా, ఒక గోల్డ్ కాయిన్ కూడా బహుమతి గా ఇచ్చాడట మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Gold Gifts). ఆయన ఇంట్లో చాలా మంది మనవరాళ్లు ఉన్నారు, కానీ ఎవరికీ కూడా ఈ స్థాయిలో చిరంజీవి బారసాల కార్యక్రమం నిర్వహించలేదట. కేవలం రామ్ చరణ్ కూతురుకి మాత్రమే అలా చేసినట్టుగా తెలుస్తుంది. దీనిని బట్టీ రామ్ చరణ్ అంటే చిరంజీవికి ఎంత స్పెషల్ అనే విషయం అర్థం అవుతుంది. ఆయన తన కొడుకుని చూసినప్పుడల్లా పుత్రోత్సాహం తో పొంగిపోతూ ఉంటాడు.

See also  Niharika : నిహారిక తన విడాకుల విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడానికి అసలు కారణం అదంట..

chiranjeevi-with-klin-kaara

ఇలాంటి కొడుకు పుట్టడం అనేది నా అదృష్టం, నా జీవితం లో నేను సాధించినది విషయాలలో గర్వంగా చెప్పుకునేది నా బిడ్డ రామ్ చరణ్ గురించి మాత్రమే అంటూ చిరంజీవి పలు సందర్భాలలో చెప్పిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అలాంటి కొడుక్కి బిడ్డ పుడితే మెగాస్టార్ ఆ మాత్రం సంబరపడిపోవడం లో ఆశ్చర్యం ఏమి లేదని అంటున్నారు అభిమానులు. ఇప్పటి వరకు బిడ్డ ముఖాన్ని అయితే అభిమానులకు చూపించలేదు కానీ, బిడ్డని పట్టుకొని మాత్రం చాలా ఫొటోలే దిగారు రామ్ చరణ్ మరియు ఉపాసన.