Nikhil Spy: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ ఒక చిన్న హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనదైన శైలిలో నటిస్తూ.. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నుకునే సినిమాలను చాలా మంచివి ఎన్నుకొని.. కథపరంగా ( Nikhil Spy first-day collection details ) చాలా జాగ్రత్తలు తీసుకొని.. నెమ్మదిగా చేస్తూ వస్తూ ఎంతో సక్సెస్ అయ్యాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన నిఖిల్ ని ఎందరో ఎన్నో రకాలుగా ప్రశంసించారు. ఆ తర్వాత 18 పేజెస్ సినిమా కూడా ఎంతో అద్భుతమైన సినిమాగా నిలిచింది. నిన్న స్పై మూవీ ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ని ఆధారంగా తీసుకుని ఆయన డెత్ మిస్టరీని కనిపెట్టే క్రమంలో సినిమా ఉంటుందని మొదటి నుంచి ప్రచారం చేసి చేయడంతో ఈ సినిమాపై భార్య అంచనాలను నెలకొన్నాయి.
ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ డెత్ అనేది యావత్ ప్రపంచానికి ఒక మిస్టరీనే. హిస్టరీలో లేని ఆ మిస్టరీని వీళ్ళు ఎలా కంక్లూజన్ ఇస్తారో? ఎలా చూపిస్తారు? అనే ఆత్రం ఆడియన్స్ లో విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ లో ఉంటుందని, ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన రోజునే.. పైగా ఈద్ సెలవు ( Nikhil Spy first-day collection details ) రావడంతో అందరూ ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని.. సినిమాకు వెళ్లడం జరిగింది. స్పై సినిమా మొదటి షో చూడగానే విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ ని సొంతం చేసుకుంది. నెగటివ్ కామెంట్స్ రావడానికి సరైన కారణం అయితే ఉంది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ కథ అందులో ఏమి లేదు. పైగా కేవలం ఆయన పేరును వాడుకొని ఆయనకు సంబంధించిన ఒక చిన్న పాయింట్ ఇందులో యాడ్ చేసుకుని వీళ్ళకి నచ్చిన కథ నచ్చినట్టు తీశారని ఎందరో ఎన్నో రకాలుగా కామెంట్లు చేయడమైతే జరిగింది.
ఏదేమైనా సినిమా అయితే డిజాస్టర్ అనే ఫీలింగ్ రప్పించింది కానీ.. కలెక్షన్ల పరంగా చూసుకుంటే మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒక్కసారి ఆ కలెక్షన్స్ చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ వ్యాపారం ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ( Nikhil Spy first-day collection details ) అయిన స్పై సినిమాకి కేవలం అమెరికా నుంచి మొదటి రోజు 1,50,000 డాలర్లు వచ్చాయి.. అలాగే కేవలం నైజాంలోనే మూడు కోట్ల రూపాయలు కలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఐదు కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్లు సినిమాకి రిలీజ్ రోజే కలెక్షన్ వచ్చాయని అంటున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ 17 కోట్లకు వరకు జరిగింది.
మొదటి రోజే ఆరు కోట్లు వచ్చిందంటే.. పైగా సెలవులు టైంలో అందరూ ముందుగానే ఒక వన్ వీక్ వరకు టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది కాబట్టి.. కచ్చితంగా సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా.. కలెక్షన్స్ అయితే మాత్రం సేవ్ అయి మూడు లోకి వెళ్ళిపోయేలా కలెక్ట్ అయిపోతాయని అంచనాలు వేస్తున్నారు. సినిమాని హైప్ తీసుకొచ్చి.. లేని దాన్ని ఉన్నట్టు ప్రమోషన్ చేయడం వల్ల.. వాళ్లకు వచ్చే లాభం ఇదేనని.. కనీసం సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటాదని అనుకుంటున్నారు. స్టార్టింగ్ లో వచ్చే కలెక్షన్స్ తో అని కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా ఇన్ని రోజులు ఇంత జర్నీలో నిఖిల్ ఎప్పుడూ కూడా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా సక్సెస్ ని చూశాడు గాని ఇదే తొలిసారిగా భారీ అంచనాలతో డిజాస్టర్ అయిన సినిమాగా మిగిలిపోయింది.