Home Cinema Keerthy Suresh: ఇంత వయస్సు వచ్చినా కీర్తి సురేష్ కి ఇంకా అది వేసుకోవడం రాదా..?...

Keerthy Suresh: ఇంత వయస్సు వచ్చినా కీర్తి సురేష్ కి ఇంకా అది వేసుకోవడం రాదా..? అయ్యో పాపం!

Keerthy Suresh Dressing: సౌత్ లో అందం, అభినయం రెండు సమానంగా ఉండే హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కీర్తి సురేష్ పేరు కచ్చితంగా ఉంటుంది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించిన ఈమె, ఆ తర్వాత మలయాళం లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తర్వాత, తెలుగు లో హీరో రామ్ నటించిన ‘నేను శైలజ’ అనే చిత్రం ద్వారా మన అందరికీ పరిచయం అయ్యింది. తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కీర్తి సురేష్, ఆ తర్వాత వరుసగా తెలుగు మరియు తమిళం బాషలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ అతి తక్కువ సమయం లోనే సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది.

See also  నీకెందుకు అలాంటి అబ్బాయిలు నచ్చలేదంటూ తమన్నాను లైవ్ లోనే అడిగిన విలేకరి..

keerthy-suresh-dont-know-how-to-wear

ఇక ఆ తర్వాత ‘మహానటి’ సినిమాలో అద్భుతమైన నటనని కనబర్చి ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు ని సొంతం చేసుకున్న నేటి తరం స్టార్ హీరోయిన్ గా చరిత్ర సృష్టించింది. ఇక రీసెంట్ గానే ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ మహానటి, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ సినిమా లో ఆయనకీ చెల్లెలు పాత్రని పోషించింది, ఈ సినిమా ఆగస్టు 11 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే కీర్తి సురేష్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. అదేమిటంటే ఆమెకి అసలు మేకప్ వేసుకోవడమే రాదట.

See also  Kriti Sanon : సంచలనం సృష్టిస్తున్న కృతి సనన్ ఎంగేజ్మెంట్ ట్విస్ట్..

keerthy suresh

సినిమా షూటింగ్ సమయం లో ఎలాగో మేకప్ మ్యాన్ దగ్గర ఉంటాడు కాబట్టి మేకప్ వేస్తారు కానీ, ఆమె స్వతహాగా ఇంట్లో నుండి బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, మేకప్ లేకుండానే బయటకి వచ్చేస్తుందట. వాస్తవానికి ఆమెకి మేకప్ లేకుండా ఉంటూనే సౌకర్యం గా ఉంటుందట, ఆమె అమ్మగారు కూడా ఇలాగే మేకప్ లేకుండా బయటకి వచ్చేది అట అప్పట్లో. ఈ విషయం తెలుసుకొని కీర్తి సురేష్ అభిమానులు మా హీరోయిన్ న్యాచురల్ బ్యూటీ, ఆమెకి ఎలాంటి మేకప్స్ అక్కర్లేదు అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు(Keerthy Suresh Dressing).

See also  Pooja Hegde: ఆ స్టార్ క్రికెటర్ తో పూజా హెగ్డే త్వరలో పెళ్ళి జరగబోతుందా.? ఇదిగో సాక్ష్యం.

actress-keerthy-suresh

అయితే ఒకప్పుడు ఎంతో పద్దతిగా ఉండే కీర్తి సురేష్, ఈమధ్య తన ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులను పిచ్చెక్కిస్తుంది. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలకు కూడా సై, కానీ కచ్చితంగా నటనకి ప్రాధాన్యం ఉండాలి అనే నియమం పెట్టుకుందట. ఇక ఈమె తెలుగు లో ప్రస్తుతం భోళా శంకర్ తో పాటుగా , నాగ చైతన్య తో కూడా ఒక సినిమా చేయబోతుంది. ప్రస్తుతం అమ్ముడు పలు సినిమాలల్లో నటిస్తుంది. కీర్తి సురేష్ అతి త్వరలో రిలీజ్ అయ్యే సినిమా భోళా శంకర్. చిరంజీవితో నటిస్తున్న ఈ సినిమా 2015లో రిలీజ్ అయినా తమిళ్ వేదాళం సినిమా రీమేక్.