Mega Princess : ఎన్నో ఏళ్లగా మెగా కుటుంబం ఎదురుచూస్తున్న పండగ లాంటి రోజు ఈరోజు వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవికి మనవరాలు పుట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోట్ చేసింది ఆ చిన్నారి. ఈ ఆనందం కేవలం మెగా కుటుంబంలోనే కాకుండా.. మెగా అభిమానుల్లో.. సినీ అభిమానుల్లో ( Stars went to see mega princes ) అందరిలోనూ కూడా ఎంతుందో చెప్పలేనంతగా ఉంది. నిన్న హాస్పిటల్లో జాయిన్ అయిన ఉపాసన తో పాటు రామ్ చరణ్.. రామ్ చరణ్ తల్లి సురేఖ కూడా వచ్చారు. ఆ తర్వాత చిరంజీవి ఎప్పుడు వస్తారు అని అందరూ ఎదురు చూశారు. ఉపాసన డెలివరీ అయిన తరవాత చిరంజీవి వచ్చి చూడడం జరిగింది.
మనవరాలు చూసిన వెంటనే అక్కడికక్కడే ప్రెస్మీట్లో అందరితో ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. బంధువులు, ఆప్తులు శ్రేయోభిలాషులు, ముఖ్యంగా అభిమానులు.. మా ఆనందాన్ని వాళ్ళ ఆనందంలా ఫీలైన అభిమానులకు నిజంగా ( Stars went to see mega princes ) ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. అలాగే బిడ్డ ఎవరు పోలికల్లో ఉంది అని మీడియా వాళ్ళు అడగ్గా.. చిరంజీవి చిరునవ్వు నవ్వారు. చూడడం అయితే చూశాను గాని.. ఎవరు పోలికల్లో ఉంది అనేది ఇప్పుడు అప్పుడే తెలియడం లేదు. ఇంకా అర్థం కావట్లేదని చెప్పారు. అలాగే ఇంకా ఉపాసన ట్రీట్మెంట్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు గురించి కూడా వివరించారు చిరంజీవి.
అలాగే రామ్ చరణ్, ఉపాసన బేబీని చూడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తరలివచ్చారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ఇద్దరు కూడా వచ్చి అభిమానులందరినీ పలకరించి ఎంతో ఆనందంగా వెళ్లారు. అలాగే ఇక నిహారిక రాగానే అభిమానులు ( Stars went to see mega princes ) అందరూ కేరింతలు కొట్టారు. నిహారిక సారీ లో వచ్చి బేబీ ని చూసి వెళ్ళింది. అలాగే చిరంజీవి భార్య సురేఖ, చిరంజీవి రెండో కూతురు శ్రీజ అందరూ బేబీని చూడడానికి రావడం లైవ్ వీడియో ప్రచారం చేయగా.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా పది సంవత్సరాలపాటు పిల్లల్ని కనకపోయినా.. ఈరోజు వాళ్ళకు కలిగిన ఈ ఆనందం.. తెలుగు ఆడియన్స్ అందరూ కూడా చూసి ఆనంద పడుతున్నారు.
అలాగే పరిస్థితి గురించి కూడా డాక్టర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉపాసన డెలివెరీ కి సంబంధించిన రూల్స్ అన్నిటిని.. ప్రెగ్నెంట్ అయిన దగ్గర్నుంచి కూడా ఫాలో అవుతూ.. ఏం తినాలి, ఏమి తినకూడదు, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎలాంటి మనస్తత్వంతో ఉండాలి ఇవన్నీ కూడా చాలా బాగా ఫాలో అయిందని.. ప్రతి కాబోయే తల్లి కూడా ఆమెను చూసి నేర్చుకుంటే.. ఫాలో అయితే మంచిదని డాక్టర్లు చెప్పారు. ఇక డెలివరీ చాలా సులభంగా జరిగిందని.. తల్లి బిడ్డ ఇద్దరూ చాలా క్షేమంగా ఉన్నారని.. ఎటువంటి చింత లేదని చెప్పుకొచ్చారు. ఉపాసన అతి తొందరలోనే ఇంటికి కూడా వెళ్లిపోయిందని తల్లి బిడ్డ ఆరోగ్యంగా చక్కగా ఉన్నారని.. ఎటువంటి టెన్షన్ లేదని.. అభిమానులకు డాక్టర్స్ స్వయంగా చెప్పడం జరిగింది.