Anasuya: ప్రముఖ యాంకర్ గ్లామర్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె యాంకర్ రంగంలో ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ.. తెలుగు బుల్లి తెర రంగంలో చక్రం తిప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతము ఐతే పూర్తిగా యాంకరింగ్ కి దూరం గా ఉంటూ కేవలం వెండి తెర పై వచ్చే అవకాశాలను ఏవి ఐనా ప్రాధాన్యత సంతరించుకున్న పాత్రలను మాత్రం ఎంపిక చేసుకుని నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇక కేవలం అవే కాకుండా లేడీ ఓరయెంటెడ్ చిత్రాలలో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని అలరిస్తుంది. (Anasuya Begging:)
అలా అంచెలు అంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగింది. ఇక ఇటీవలే ఆమె నటించిన విమానం చిత్రం కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుంటు పోతూ సత్తా చాటుకుంది. అన్నిటికంటే అందరికీ తెలిసిన విషయం.. అనసూయ ప్రతి రోజు చాలా చురుగ్గా సోషల్ మీడియా లో ఉంటుంది. నిత్యం ఎప్పటికప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ రోజుకోక ఘాటు ఘాటు హాట్ ఫోటో షూట్ లను షేర్ చేసే ఈమె నిత్యం ఏదో ఒక రకమైన వివాదాల్లో తల దూర్చుతూనే ఉంటుంది.
ఇక అప్పట్లో విజయ్ దేవరకొండ అభిమానులతో ఓ గొడవలో తల దూర్చిన తను ఇప్పటికే ఆ వివాదంలో అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. కొంతమంది అభిమానులు ఆమెను టార్గెట్ చేసినట్లు వార్తలు కూడా వ్యాపించాయి. ఐతే మరొక్కసారి తాజాగా అనసూయ ఓ సంచలనమైన ట్వీట్ చేయడంతో అది కూడా మరొక్కసారి హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే నాకు సంభందించని ఎలాంటి విషయా లలో నైనా.. సరే దయచేసి అస్సలు లాగొద్దు అంటూ ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. పొలిటికల్ సినిమా పరిశ్రమలో నా పేరును వాడుతూ కొందరిని అగౌరవ పర్చాలని చూసానని..
అలాంటి విషయాలకు నాకు అస్సలు ఎలాంటి సంబంధం లేదని.. మీకు దండం పెడతాను దయచేసి మమ్మల్ని (Anasuya Begging) వదిలేయండి మిమ్మల్ని వేడుకుంటున్నానంటున్న అనసూయ. ఇక నేను నా నటనను నమ్ముకుని స్వశక్తి గా ఎదిగిన మహిళ అని నాకు నచ్చిన విధంగా నా జీవితాన్ని గడుపుతున్నాను అని చెబుతుంది. ఇక ఇదే కాకుండా.. నాకు అందరిలా సెపరేట్ గా పిఆర్ టీమ్ అనేది ఎది లేదని ఒకవేళ నేను ఏదన్నా చెప్పదలచుకుంటే సోషల్ మీడియా వేదికకా స్వయంగా నేనే చెబుతానని వాదిస్తానని.. నాకంటూ ఒక కుటుంబం ఉంది. దయచేసి సంబంధం లేని విషయాల్లోకి అస్సలు నన్ను లాగొద్దు.. అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.
Hello everyone.. I have a request to make.. I’ve been coming across many tweets since few days.. where my name is being used as a mean comparison to disrespect others in political and entertainment industry.. which in turn is disrespectful to me too as my name is used as (1/4)
— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 19, 2023