Home Cinema Rakesh Master- Sekhar Master: నేను చచ్చాక నా శవం చూడ్డానికి కూడా రావద్దు అంటూ...

Rakesh Master- Sekhar Master: నేను చచ్చాక నా శవం చూడ్డానికి కూడా రావద్దు అంటూ శేఖర్ మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్..

Rakesh Master- Sekhar Master: చాలామంది ప్రాణ స్నేహితుల మధ్య సైతం కొన్ని చిన్న చిన్న కారణాలవల్ల గొడవలు పడుతూ విడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది కేవలం మనలాంటి ప్రజానీకానికే కాక సినిమా రంగంలో ఉన్న చాలామంది ప్రాణ స్నేహితులకు సైతం ఇలా జరిగింది అలా జరిగిన వాళ్లలో రాజ్ కోటి లాంటి ప్రాణ స్నేహితులు సైతం కొన్ని సందర్భాల్లో గొడవలు పడి ఎవరికి వారు విడిపోయారు ఇలా కేవలం చాలామంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు సైతం ఏవేవో చిన్న చిన్న కారణాల చేత దూరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలా బెస్ట్ బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నటువంటి రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ మధ్య కూడా గతంలో ఎన్నో రకాల గొడవలు జరిగాయట.. ఇక రాకేష్ మాస్టర్ దగ్గరే శేఖర్ మాస్టర్ డాన్స్ నేర్చుకున్నారు. వీరిద్దరి మధ్యలో ఎంతో అన్యోన్యమైన గురు శిష్యులు అనుబంధం ఉండేది.

See also  Rakul Preet Singh: ఎంత అవకాశాలు లేకపోతే మాత్రం.. రకుల్ గురించి వాళ్ళు అలా ఆలోచిస్తారా?

rakesh-master-gave-a-warning-to-sekhar-master-saying-that-when-i-die-dont-even-come-to-see-my-dead-body

అయితే ఏమైందో తెలియదు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం కూడా తెగిపోయింది. అయితే వీరిద్దరూ విడిపోవడానికి అసలు సిసలైన కారణం తెరపైన ఎన్నో వినిపించాయి. ఇదే కాకుండా వీళ్ళిద్దరూ యూట్యూబ్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు ఒకళ్ళపై ఒకళ్ళు ఎన్నో రకాల విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ పై ఉన్న కోపాన్ని బయటపెట్టాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ శేఖర్ ని చాలా బాగా చూసుకున్నాను ఎన్నో సినిమాల్లో నాకు అవకాశం వచ్చినప్పటికీ నాకన్నా శేఖర్ బాగా బెటర్ అని భావించి అతనికి ఇచ్చేశాను.

See also  Adivi Sesh-Akkineni Supriya: అక్కినేని సుప్రియ అడవి శేష్ ను ఘోరంగా మోసం చేసిందా.? మరి చేసుకుందాం అనుకున్న పెళ్లి.

ఇదే కాకుండా వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పించాను అలా అన్ని విషయాలలో నేను అండగా నిలబడ్డాను. కానీ మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో వాడికి 2 పాటలు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వస్తే మాత్రం నాకు ఆ విషయాన్ని చెప్పకుండా దాచాడు. పైగా నాకు చెప్పలేదు కానీ తన భార్యకి విషయాన్ని చెప్పాడు. ఇక అప్పటినుంచి నాకు వాడి పై విపరీతమైన కోపం పెరిగింది. దాంతో నేను చచ్చాక నా శవాన్ని కూడా చూడ్డానికి రావొద్దు అంటూ ఓ ఇంటర్వ్యూలో లో వెల్లడించాడు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ శేఖర్ మాస్టర్ మరొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాకేష్ మాస్టర్ దగ్గర నేను డాన్స్ నేర్చుకున్నాను. (Rakesh Master- Sekhar Master)

See also  Kalyan Dev: కొణిదెల శ్రీజ గురించి పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. సోషల్ మీడియాలో వైరల్..

ఆయన ఎంతో మంచి గురువుగారు అయితే నాకు చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 చిత్రంలో అవకాశం వచ్చింది నిజమే.. కానీ అది ఇంకా అప్పటికి కన్ఫామ్ అవ్వలేదు. దాంతో నేను ఆ విషయం ఆయనకు చెప్పలేదు. అయితే రాకేష్ మాస్టర్ నా తల్లిని గురించి చాలా అవమానకరంగా మాట్లాడడమే కాకుండా.. నా భార్యకి ఫోన్ చేసి కూడా అసభ్యంగా మాట్లాడాడు. ఆ కారణం చేతనే నేను ఆయనకు దూరంగా ఉండి ఉన్నాను. అయినా ఎవరి టాలెంట్ వాళ్లది అంటూ స్పందించాడు శేఖర్ మాస్టర్. కాగా ఇటీవలే రాకేష్ మాస్టర్ మరణించిన నేపథ్యంలో శేఖర్ మాస్టర్ ఆయనని చివరి చూడ్డానికి వెళ్తాడో లేదో అనేది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న విషయం..