Rakesh Masters: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కొన్ని వందల చిత్రాలకి ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేసి తనలోని అద్భుతమైన పనితీరును కనబర్చిన మాస్టర్ ఎన్నో విజయాలను తన కైవసం చేసుకున్నారు. అయితే తన సినీ కెరియర్ పరంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని చూసినప్పటికీ ఆయన జీవితంలో మాత్రం అంతా నిరాశ నిష్ప్రహాలతో విఫలం అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు నా అనుకున్న వాళ్లే ఒక్కొక్కరిగా మరణించడంతో చివరికి కట్టుకున్న భార్య కూడా ఆయనని విడిచిపెట్టి వెళ్లడంతో మాస్టర్ జీవితం అతలాకుతలమైపోయింది.
నా అనుకున్న వాళ్లు ఎవరూ లేక చివరికి అనాధ ఆశ్రమంలో చేరిన ఆయన నిన్న అనారోగ్య సమస్యలతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే ఆయన మరణం అనంతరం గతంలో ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ప్రస్తుతం ఒక్కొక్కటిగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే రాకేష్ మాస్టర్ అవకాశాల కోసం వెతుకుతున్న కొత్తలో అప్పుడప్పుడు ఆయన కెరియర్ ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన జీవితాన్ని మార్చిన హీరో గురించి గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ప్రస్తుతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
రాకేష్ మాస్టర్ (Rakesh Masters) వెల్లడిస్తూ ఆయన లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయం అవుతుందని.. కేవలం అతని వల్ల నేను ఇంత ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని తెలిపాడు. నాడు ఆ హీరో అలా చేయడం వల్లే నేను నేను ఉన్నత స్థితిలో ఇలా ఉన్నానని ఆ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపాడు. మరి రాకేష్ మాస్టర్ కి సహాయం చేసిన హీరో మరెవరో కాదు వేణు తొట్టెంపూడి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా రాకేష్ మాస్టర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ జీవితంలో నేను పడ్డ కష్టాలు నష్టాలు గురించి.. అవకాశం కోసం తొక్కని మెట్టు.. ఎక్కని గడపాలేదు..
అలాంటి సమయంలోనే వేణు సార్ నాకు పిలిచి మరి అవకాశం కల్పించారు. ఆ క్షణాలు నా జీవితంలో మర్చిపోలేనివి.. ఇక వేణు సార్ వల్లే నేను కొరియోగ్రాఫర్ గా సినిమాలలో రాణించగలిగాను. వేణు హీరోగా నటించిన చిరునవ్వుతో చిత్రంలో రాకేష్ మాస్టర్ నిన్నలా లేదురా అనే పాటకు కొరియోగ్రాఫిక్ చేశాడు. అదే నా తొలి సినిమా కొరియోగ్రఫీ. ఆయన వల్లే నా జీవితం చాలా గొప్పగా మారిందంటూ రాకేష్ మాస్టర్ వెల్లడించారు. ఇక పోతే ఆయన నిన్న తీవ్రమైన అనారోగ్యంతో గాంధీ హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించడంతో ఆయనకు సంబంధించిన ఒక్కో విషయం ఇలా బయటకు వస్తూ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.