Home Cinema Rakesh Master Last Wish: బ్రతికి ఉన్నప్పుడే చెప్పాడట నన్ను అక్కడ సమాధి చెయ్యాలని.. రాకేష్...

Rakesh Master Last Wish: బ్రతికి ఉన్నప్పుడే చెప్పాడట నన్ను అక్కడ సమాధి చెయ్యాలని.. రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఇదే..

Rakesh Master Last Wish: సినిమా రంగంలోకి చాలామంది కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి గొప్ప స్టార్స్ గా ఎదుగుతుంటారు.. అలా ఎదిగిన వాళ్లలో ఇప్పటికీ ఎందరో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇలాంటి వాళ్లలో కొరియోగ్రాఫర్ గా ఓ మంచి గుర్తింపు సాధించిన రాకేష్ మాస్టర్ కూడా ఇందులో ఒకరు. ఇక ఇటీవలే అనారోగ్య కారణాల చేత రాకేష్ మాస్టర్ కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే.. దాంతో ఆయన ఎప్పుడైతే మరణించారో అప్పటి నుండే సోషల్ మీడియా మొత్తం ఆయనకు సంబంధించిన..

See also  Balakrishna: జై బాలయ్య.. నీకు కూడా ఆ స్టార్ హీరోయిన్ తో గాఢమైన లవ్ స్టోరీ నిజంగా ఉందా?

he-said-while-he-was-still-alive-that-he-wanted-to-bury-me-there-this-is-the-last-wish-of-rakesh-master

గతంలో ఆయన మాట్లాడిన వీడియోలు, మాటలు మొదలైనవి వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో గతంలో ఓసారి రాకేష్ మాస్టర్ డి ప్రోగ్రాం లో పాల్గొన్నప్పుడు ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఆ ప్రోగ్రాం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు చావంటే అస్సలు భయం లేదు.. కానీ నా అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు.. నా అన్న కొడుకు, నాన్న, అమ్మ, తమ్ముడు ఇలా చాలామంది చనిపోయారు. దాంతో నాకు ఫోన్ వస్తే చాలు భయం వేస్తుంది ఏ మరణ వార్త వినాల్సి వస్తుందోనని ఇంకా.. అంటూ తెలిపాడు. నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన వేణు సార్ కి ఎప్పటికీ కృతజ్ఞత గానే ఉంటాను.

See also  Roja : చిరు రాంచరణ్ లకు విషెస్ చెబుతూ రెండు నిజాలు బయటపెట్టిన రోజా!

he-said-while-he-was-still-alive-that-he-wanted-to-bury-me-there-this-is-the-last-wish-of-rakesh-master

ఇక శేఖర్ కి చాలామంది ఆ కొరియోగ్రాఫర్ దగ్గర ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారట.. కానీ శేఖర్ మాత్రం వారి మాటలు వినిపించుకోకుండా నాతో అన్ని విషయాల్లో తోడునీడగా ఉన్నారు. నేను ఇంత వరకు ఎవరిని మోసం చేయలేదు. మనం వేసుకున్న బట్టలు ఈ శరీరం మనతో ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవి కాదు. ప్రతి ఒక్కటి మన ప్రాణం తో సహా మన దేహంతో సహా ఈ మట్టిలో ఐక్యమైపోవాల్సిందే. అంటూ గతంలో వెల్లడించగా.. ఆయన చనిపోతే ఎలా ఉంటుందో అనే అంతిమయాత్ర కూడా వీడియో తీసుకొని పెట్టుకున్నాడు.

See also  Prabhas: ప్రభాస్ అమ్మగారు షాకింగ్ కండీషన్..!! మా ఇంటికి కోడలుగా రావాలంటే ఆ పని చెయ్యాల్సిందే..? మైండ్ బ్లాక్ లో ఫాన్స్...

he-said-while-he-was-still-alive-that-he-wanted-to-bury-me-there-this-is-the-last-wish-of-rakesh-master

కేవలం ఇదే కాకుండా ఒకవేళ నేను చనిపోతే నా భార్య తండ్రి నా మామగారు సమాధి పక్కనే నేను వేప చెట్టు నాటాను. ఆ వేప చెట్టు కిందే నన్ను సమాధి చేయాలి. ఇదే నా చిట్టా చివరి కోరిక అంటూ రాకేష్ మాస్టర్ గతంలో చెప్పిన ఓ ఇంటర్వ్యూలో వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతుంది. మరి రాకేష్ మాస్టర్ చివరి కోరిక ప్రకారమే ఆయన సమాధిని ఆ వేప చెట్టు కింద కడతారా లేదా అనేది ఎదురు చూడాల్సిన విషయం. (Rakesh Master Last Wish)