Rajamouli – Mahesh Babu : బాహుబలి పార్ట్ వన్, బాహుబలి పార్ట్ 2 తో రాజమౌళి స్థాయి ఒక రేంజ్ కి వెళ్ళింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇక ప్రపంచ స్థాయికి వెళ్లడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అందరికీ కాన్సన్ట్రేషన్ ఉండక తప్పదు. అటువంటి రాజమౌళి నెక్స్ట్ సినిమాకి మహేష్ బాబుని హీరోగా ఎన్నుకున్నాడన్న సంగతి ( Rajamouli and Mahesh Babu ) మనందరికీ తెలిసిందే. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతుంది అన్న విషయం తెలిసిన దగ్గర నుంచి మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు ఎప్పుడు ఆ సినిమా మొదలవుతుందా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ బిజీలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.
గుంటూరు కారం సినిమా కోసం రిలీజ్ చేసిన టీజర్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. సినిమా పోస్టర్ టీజర్ లో మహేష్ బాబు వేసుకున్న షర్టు ఎంత పాపులర్ అయిందో కూడా తెలుసు. అలా మహేష్ బాబు ఏం చేసినా కూడా ఒక స్పెషల్ గానే ఉంటుంది. అలాంటిది రాజమౌళితో కలిసి మహేష్ బాబు చేయబోయే సినిమాపై ( Rajamouli and Mahesh Babu ) భారీ అంచనాల నెలకొన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ లెవెల్లో సక్సెస్ సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఆశిస్తున్నట్టుగానే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే గుంటూరు కారం సినిమా 2024 సంక్రాంతి పండుగకి విడుదలవుతుందని అందర్నీ సందడి చేస్తుందని ఎప్పటినుంచో చెబుతున్నారు.
అంటే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సంక్రాంతి పండుగలకు విడుదలైతే.. సంక్రాంతి బరిలో కచ్చితంగా గుంటూరు కారం టాప్ రేంజ్ లో ఉంటుందని మహేష్ బాబు అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్, రాజమౌళి కాంబినేషన్లో మహేష్ బాబు సినిమా ఎప్పుడు మొదలవుతుందా ఈరోజు రేపు అన్నట్టు ఎదురుచూస్తున్నారు కానీ.. రాజమౌళి.. మహేష్ బాబు సినిమా ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టినరోజు నాడు ( Rajamouli and Mahesh Babu ) స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు అంట. ఈ లోపు ఈ రెండు నెలల్లో రాజమౌళి కథ మీద కథలో కీలకమైన మలుపులు చేర్చుకుంటూ అప్డేట్ కథను రాసుకునే పనిలో ఉంటాడట. ఈ రెండు నెలలు కష్టపడి మార్చి ఇంకా బాగా చేసినా కథ ని మళ్లీ మహేష్ బాబుకి వినిపిస్తారని అంటున్నారు.
అలా మహేష్ బాబుతో మళ్లీ కథ గురించి డిస్కస్ చేసి ఫైనల్ అయిన తర్వాత అప్పుడు మిగిలిన ఆర్టిస్టుల గురించి ఆలోచించాలని.. వారిని సెలెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అంట రాజమౌళి. మహేష్ బాబు బర్త్డే రోజు స్టార్ట్ చేసే ఈ సినిమా షూటింగ్ ఏదో సింపుల్ పూజలా కాకుండా.. దాన్ని చాలా గ్రాండ్ గా చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడంట. ఒకపక్క మహేష్ బాబు పుట్టినరోజు, మరోపక్క గ్లోబల్ లెవెల్ లో అదరగొట్టే సినిమా స్టార్టింగ్ రోజు కాబట్టి.. రెండిటినీ కలిపి ఎంతో అద్భుతంగా చేసి.. కోట్లు ఖర్చుపెట్టి చేయాలని ఫిక్స్ అయ్యాడంట. ఎందుకంటే.. ఎంత ఖర్చైనా ఆ ఈవెంట్ ని మళ్లీ ఆ సినిమా సక్సెస్ అయిన తరవాత ఆ ఈవెంట్ లో ఈ స్టార్టింగ్ వీడియో ని చూపించాలని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.