Home Cinema Anushka : బ్రేకింగ్.. ఆల్రెడీ ఎప్పుడో పెళ్లి అయిపోయిందని తన నోటితో చెప్పిన అనుష్క!

Anushka : బ్రేకింగ్.. ఆల్రెడీ ఎప్పుడో పెళ్లి అయిపోయిందని తన నోటితో చెప్పిన అనుష్క!

anushka-sensational-comments-about-her-marriage-with-prabhas-and-the-other-4-heroes

Anushka : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాలో అనుష్క మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అప్పటినుంచి ఆమె సినిమా ప్రయాణం వెనుతిరిగి చూడకుండా విజయవంతంగా దూసుకుపోతూ వచ్చింది. ప్రతి హీరో సరసన ఆమె నటించేటప్పుడు ( Anushka comments on marriage with Prabhas ) ఆ కెమిస్ట్రీ ఎంతో చక్కగా ఉంటుంది. తెలుగు సినిమా రంగంలో అనుష్క అనే ఒక పేరు ఎంతగానో గుర్తుండిపోయేలా.. అంతటి స్టార్ హీరోయిన్ అయింది. గ్లామర్ రోల్స్ కి ఎంత న్యాయం చేసిందో.. అలాగే నటనాపరంగా ఉన్న క్యారెక్టర్లు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా అంతే అద్భుతంగా చేసింది. అరుంధతి లాంటి సినిమాతో ఆమెలో ఉన్న నటన ప్రతిభ ఎంత బయటకు వచ్చిందో.. దాన్ని జేజమ్మ జేజమ్మ అంటూ ఇప్పటికీ అరుంధతిని మర్చిపోలేని స్థితిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది.

anushka-sensational-comments-about-her-marriage-with-prabhas-and-the-other-4-heroes

అలాగే బాహుబలి లాంటి సినిమాలో ఆమె నటన అద్భుతం.. అనుష్క గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె సినీ ప్రయాణం నిజంగా గర్వ కారణం.. బాహుబలి సినిమా తర్వాత అనుష్కకి పెద్దగా సూపర్ డూపర్ హిట్స్ అయితే అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఆమెపై ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అనుష్క ప్రస్తుతం ( Anushka comments on marriage with Prabhas ) నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎంతో శర వేగంగా జరుగుతూ.. ఇంకొన్ని రోజుల్లో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే అనుష్క కెరీర్ గురించి పక్కన పెడితే.. ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా అనుష్క పెళ్లి గురించే ఎక్కువగా వార్తలు వస్తాయి. అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకోబోతుంది?

See also  లీడర్ చిత్రంలో హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏ రేంజ్ లో తయారయ్యిందంటే..

anushka-sensational-comments-about-her-marriage-with-prabhas-and-the-other-4-heroes

అనుష్క ,  ప్రభాస్ తో ప్రేమలో ఉందా ? అనుష్కకి ప్రభాస్కి ఎప్పుడు పెళ్లి అవుతుంది? వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగున్ను.. ప్రభాస్ కి జ్వరం వచ్చిందంటే అనుష్క బాధపడుతుంది అంటూ.. ఇలాంటి వార్తలు రోజు ఒకటి అయినా వస్తూనే ఉంటాయి. అయితే వీటన్నిటి గురించి అనుష్క ఒక క్లారిటీ ఇచ్చింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్ కోసం అనుష్క కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ( Anushka comments on marriage with Prabhas ) అనుష్క మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి విషయంలో అందరూ అంటున్న మాటలకి అనుష్క ఎంత విసిగిపోయి.. దాన్ని ఎంత ఎంతగా లైట్ తీసుకుంటుందో ఈ మాటలతో అర్థమవుతుంది. ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు గురించి స్పందించింది. ఇప్పటికే నాపై ఎన్నో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.

See also  Rakul Preet Singh: సినిమాలలో అవకాశాలు లేక చివరకి ఇంత పనికి దిగజారిన రకుల్ ప్రీత్..

anushka-sensational-comments-about-her-marriage-with-prabhas-and-the-other-4-heroes

వాటిని లైట్ తీసుకోవడం మొదలుపెట్టాను. మరీ ముఖ్యంగా నాకు ఐదు సార్లు పెళ్లిళ్లు చేసేసారు అని చెప్పింది. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరని అడగ్గా.. అప్పుడు.. నాకు ప్రభాస్ తో ఒకసారి పెళ్లి చేశారు.. నాగార్జునతో పెళ్లి చేశారు.. సుమంత్ తో పెళ్లి చేశారు.. ప్రకాష్ కోవెలమూడితో పెళ్లి చేశారు.. గోపీచంద్ తో కూడా పెళ్లి చేశారు.. అంటూ ఇలా సమాధానం ఇచ్చి నవ్వేసింది. ప్రస్తుతం అనుష్క మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారితో నటించిన ఒక్క మగాడి సినిమా తనకు అస్సలు నచ్చలేదని చెప్పుకొచ్చింది. ఏదేమైనా అనుష్క పెళ్లి ప్రభాస్ తో ఎప్పుడు అని ఆలోచిస్తున్న తరుణంలో.. ఇలా అందరితో ప్రభాస్ ని కూడా కలిపేసి నాకు అందరితోని పెళ్లి చేసేసారు అని చెప్పడం.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.