Actress SriDevi: సినిమా ప్రపంచంలోనే తన దైన శైలిలో తనేంటో నిరూపించుకొని యావత్ ప్రపంచానికి అతిలోక సుందరిగా దివంగత నటి శ్రీదేవి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. బాల నటిగా తన జీవితాన్ని ప్రారంభించిన శ్రీదేవి.. నాటి సీనియర్ హీరోల నుండి నేటి సీనియర్ హీరోల వరకు వాళ్ళ సరసన నటించింది. అలా దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీని ఏలుతూ స్టార్ హీరోయిన్ గా తనదైన శైలిలో ముద్ర వేసుకుంది. కేవలం సౌత్ సినిమాలలోనే కాకుండా నార్త్ లోనూ సైతం అనేక చిత్రాల్లో నటించి యావత్ దేశమంతా తన నటన ప్రతిభను చాటుతూ ఆమెకి ఎవ్వరు సాటి లేరనే ఋజువు తన సొంతం చేసుకుని కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది ఈ అతిలోకసుందరి.
ఇక ఆమె సినీ కెరియర్ పరంగా అద్భుతంగా రాణించినప్పటికీ.. ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూనే వస్తుంది. అలా బాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరుపొందిన బోనీ కపూర్ ని శ్రీదేవి పెళ్ళాడింది. ఇక ఈ దంపతులకి జాన్వి కపూర్ మరియు ఖుషి కపూర్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కాగా శ్రీదేవి పెళ్లి విషయంలో చాలా పెద్ద వడి దుడుకులే ఏర్పడ్డాయని చెప్పాలి. అవేంటంటే ఆమె పెళ్లి చేసుకుంటా అన్నప్పటికీ కూడా మన తెలుగు హీరోలు నిరాకరించారట.. వాళ్ళు ఎవరో చూద్దాం..
మరి అందులో మొదటి స్థానంలో ఉన్నాడు డాక్టర్ రాజశేఖర్. అవును మీరు విన్నది నిజమే డాక్టర్ చదివి యాక్టర్ అయిన రాజశేఖర్ హీరోగా అప్పుడప్పుడే రాణిస్తున్న రోజులవి. ఇక ఆయన అందం, గుణం మెచ్చినచ్చిన శ్రీదేవి తల్లి అతడి కుటుంబంతో పెళ్లి సంబంధం మాట్లాడిందట.. అయితే శ్రీదేవి అప్పటికే పెద్ద స్టార్ హీరోయిన్.. అయితే ఓ హీరోయిన్ ని కోడలుగా తెచ్చుకోవడం రాజశేఖర్ తల్లిదండ్రులకి ఇష్టం లేక ఆమెతో వివాహానికి అభ్యంతరకరం వ్యక్తం చేశారట. ఇక ఆ తర్వాత హీరోగా రాణించిన రాజశేఖర్ తన తోటి నటి అయిన జీవిత తో మూడు ముళ్ళు ఏడు అడుగులు వేసాడు.
ఇక శ్రీదేవితో పెళ్లికి నిరాకరించిన మన తెలుగు హీరోల్లో మురళీమోహన్ కూడా ఒకరు.. సినీ కెరియర్ పరంగా అప్పట్లో మంచి ఊపు మీదున్న మురళీ మోహన్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆమెకు నో చెప్పాడట. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వద్ద కూడా శ్రీదేవి తల్లి పెళ్లి ప్రపోజల్ పెట్టగా ఆయన కూడా తిరస్కరించాడని టాకైతే వినిపిస్తోంది.. ఇక బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తితో శ్రీదేవి కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిందట.. వాళ్ళిద్దరూ రహస్యంగా కూడా పెళ్లి చేసుకున్నారని.. కాగా తన మొదటి భార్య గీతాంజలి కి విడాకులు ఇవ్వలేదన్న కారణంతోనే మిదున్ చక్రవర్తికి శ్రీదేవి దూరమైపోయిందని చెబుతుంటారు. ఇక చివరగా 1996 వ సంవత్సరంలో బోనీ కపూర్ తో గుడిలో మూడు ముళ్ళు ఏడు అడుగులతో ఒక్కటయింది (Actress SriDevi) శ్రీదేవి. అయితే అప్పటికే బోనీకపూర్ కి కూడా పెళ్లయి పిల్లలు ఉండడం గమనార్ధం..