Home Cinema Manchu Manoj : మంచు మనోజ్ దంపతులు జై శ్రీ రామ్ అంటూ ఎం చేసారో...

Manchu Manoj : మంచు మనోజ్ దంపతులు జై శ్రీ రామ్ అంటూ ఎం చేసారో తెలుసా?

manchu-manoj-and-bhuma-mounika-buy-adipurush-movie-tickets-and-give-them-to-orphan-kids

Manchu Manoj : పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ప్రభాస్ ఎప్పుడు రాఘవుడిగా కనిపిస్తూ.. మన అందరిని భక్తిపారవశ్యంలో ముంచేందుకు ఆదిపురుష్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. సినిమాలో ( Manchu Manoj and Bhuma Mounika ) ప్రభాస్ హీరోగా, కృతి సనన్ జానకి మాతగా నటిస్తూ.. ఓం రైతు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా జూన్ 16వ తేదీన మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చాలా గట్టిగా జరుగుతున్నాయి. హీరో, హీరోయిన్, దర్శకుడు అందరూ కూడా ఎక్కడకక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూ.. అందరితో మాట్లాడుతూ.. సినిమా ఎంత కష్టపడి తీశారు.. ఎంత బడ్జెట్ తో తీశారు.. ఎంత గొప్పగా తీశారు అని చెప్తూ వస్తున్నారు.

See also  NagaBabu Chiranjeevi: మళ్ళీ పెళ్ళి విషయంలో ఆ తప్పు రిపీట్ అయ్యిందంటే ఈ సారి అస్సలు బాగోదంటూ నాగబాబును హెచ్చరించిన చిరంజీవి..

manchu-manoj-and-bhuma-mounika-buy-adipurush-movie-tickets-and-give-them-to-orphan-kids

అలాగే ఆదిపురుష్ సినిమాని యావత్ భారతదేశం కూడా దాన్ని ఒక సినిమాగా చూడకూడదని.. ఆ రామాయణ గ్రంధాన్ని చూడాలని చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే ఆ రాముల వారి గురించి తెలుసుకునే క్రమంలో.. ఆ శ్రీరామచంద్రుని గాధ వినడానికి ప్రతి ధియేటర్ కి హనుమంతుడు వస్తాడని.. అందుకే ఒక సీటు ఖాళీగా ( Manchu Manoj and Bhuma Mounika ) కూడా ఉంచాలని అంత భక్తిని చూపిస్తున్నారు. ఇక సెలబ్రిటీస్ బాలీవుడ్, టాలీవుడ్ అన్ని చోట్ల నుంచే కూడా అందరూ ఈ సినిమాని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా యావత్ భారతదేశంలో ప్రతి భారతీయుడిది అని చెప్తున్నారు. ఆదిపురుష్ సినిమా కేవలం డబ్బును ఖర్చు పెట్టగలిగి చూసే వాళ్ళు మాత్రమే కాకుండా..

See also  Vijay Antony: విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య కు అసలు కారణం అదా.. దీనికి విజయ్ సమాధానం?

manchu-manoj-and-bhuma-mounika-buy-adipurush-movie-tickets-and-give-them-to-orphan-kids

ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని ఉద్దేశంతో డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ముందుకు వచ్చి సినిమా టికెట్లను కొని నిరుపేదలకు, దేవాలయాల దగ్గర, అనాధ శరణాలయాల దగ్గర, చిన్న పిల్లలకు పంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10000 టికెట్లను కొని పంచుతున్నారు. బాలీవుడ్ హీరో ( Manchu Manoj and Bhuma Mounika ) రన్బీర్ కపూర్ 10,000 టికెట్లను పంచుతున్నారు. అలాగే టాలీవుడ్ లో ప్రమోషన్ కంపెనీ శ్రేయాస్ మీడియా ఖమ్మంలో ప్రతీ రామాలయం లో 101 టికెట్స్ పంచడం జరుగుతుంది. ఇలా ఆదిపురుష్ సినిమా గురించి టికెట్లు పంచేందుకు నిరుపేదల సైతం ఈ సినిమా చూసేందుకు అందరూ దోహదపడుతున్నారు. కారణం కేవలం ఆ శ్రీరామచంద్రుని మహిమ అని చెప్పుకుంటున్నారు.

See also  Samantha : పనిగట్టుకుని ప్రభాస్ అల్లుఅర్జున్ పరువు తీసిన సమంత.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

manchu-manoj-and-bhuma-mounika-buy-adipurush-movie-tickets-and-give-them-to-orphan-kids

ఆదిపురుష్ సినిమా కోసం ఎలాంటి హద్దులు లేకుండా, ఎలాంటి తారతమ్యం లేకుండా, ఈ సినిమాని మన భారతదేశం ఒక పండగలా చేసుకోవాలని.. అందరం కలిసి ఆనందంగా చూసి ఎంజాయ్ చేయాలని.. సెలబ్రిటీస్ పిలుపునిస్తున్నారు. ఇదే క్రమంలో మంచు మనోజ్ భూమా మౌనిక దంపతులు కూడా జైశ్రీరామ్ అంటూ.. ఈ సినిమా టికెట్లను 2500 టికెట్లను అనాధ పిల్లలకు పంచుతున్నారు. నిజంగా ఆదిపురుష్ సినిమా పరంగా ఎలా ఉంటుందో తెలియదు గానీ.. ఆ శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా అందరిలో మంచితనాన్ని, భక్తిని నింపడానికే ఈ అవకాశం ఇచ్చాడేమో అని కొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా జూన్ 16వ తేదీ ఆదిపురుష్ సినిమా చూడడంతో మనకు ప్రభాస్ అభిమానుల ఆశలు, అంచనాలు ఎంత వరకు రీచ్ అయ్యిందో తెలుస్తుంది.