Chinnari Pellikuthuru Fame: చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్ తో దేశ వ్యాప్తంగా తన దైన శైలిలో ఎంతలా గుర్తింపు నొందిందో అలాంటి ఆవికా గోర్ గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఆమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది.. మొదటి నుండి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ కి టాలీవుడ్ లో మాత్రం ప్రత్యేకమైన పాపులారిటీ దక్కించుకుంది. ఇక్కడ మన తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని చిత్రాలు కూడా చేసింది.
అందులో కొన్ని చిత్రాలు భారీ స్థాయిలో హిట్ అవ్వగా మరికొన్ని చిత్రాలు ప్లాప్ అయ్యాయి. కాగా సినిమాల్లో అవకాశాలు లభించినప్పటికీ హీరోయిన్ గా కంటే సీరియల్ లోని భారీ స్తాయిలో పాపులాటి దక్కించుకున్న అవికా గోర్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ స్టేటస్ రావాలని ఇప్పటికీ కూడా తన ప్రయత్నాన్ని కష్టం రూపంలో చూపెడుతూనే ఉంది. కానీ ఆమె పడే కష్టానికి ఆమె దానిని అందుకోలేస్తుందా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మిగిలే ఉంది.. కాగా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా గోర్..
తన సీరియల్ కు సంబంధించిన ఓ విషయాన్ని తెలుపుతూ తెగ నవ్వుకుంది. అయితే గతంలో ఆమె నటించిన సీరియల్ లో ఏకంగా ఆమెకి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏడు సార్లు పెళ్లి చేశారట. అయితే అందులో మూడు సార్లు హీరోతో చేయడం.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో చేయడం.. ఇక చివరగా మూడు సార్లు చనిపోయినట్టు నటించమన్నారని.. ఆ తర్వాత ఆత్మతో మాట్లాడుతున్నట్లు నటించమన్నారని తాను ఇంటర్వ్యూలో భాగంగా తెలుపుతూ ఇక ఆ సమయంలో నాకు చాలా నవ్వొచ్చిందని చెప్పుకొచ్చింది.
ఇక ఆ విషయాల గురించి కాక మరికొన్ని విషయాల గురించి కూడా అవికా గోర్ (Chinnari Pellikuthuru Fame) మాట్లాడుతూ స్టార్ పవర్ అంటేనే సౌత్.. సౌత్ లో స్టార్స్ మీదే సినిమాలన్నీ నడుస్తుంటాయి. సౌత్ లో నెపోటిజం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రేక్షకులు చూస్తున్నట్టు అక్కడి వాళ్ళు చూడరు. ఇటీవలే బాలీవుడ్, హిందీ సినిమాలపై తీవ్రమైన వివక్షత వచ్చేలా చేశారు. ఎంతలా అంటే సౌత్ సినిమాలు చాలా రీమేక్ చేస్తూ బాలీవుడ్ వాళ్ళ సౌత్ సినిమాలను కాపీ కొడతారు అనే స్థాయికి తీసుకొచ్చారు. ఇక సౌత్ లో మరి ముఖ్యంగా తెలుగులో చాలా ఎక్కువే ఉంది అంటూ ఘాటుగా స్పందించింది. దాంతో ఈ అమ్మడు మాట్లాడిన మాటలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.