Home Cinema Kriti Sanon : అతని అసభ్య వేధింపుతో ఆదిపురుష్ హీరోయిన్.. ఇక సినిమాలకు గుడ్ బాయ్!

Kriti Sanon : అతని అసభ్య వేధింపుతో ఆదిపురుష్ హీరోయిన్.. ఇక సినిమాలకు గుడ్ బాయ్!

adipurush-heroine-kriti-sanon-decided-to-leave-movies-because-of-that-person-indecent-harassment

Kriti Sanon : జూన్ 16వ తేదీ ఎప్పుడు వస్తుందా అని యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది. ఎందుకంటే ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆదిపురుష్ సినిమా జూన్ 16వ తేదీన మన ముందుకు వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జానకి పాత్రలో కృత్తిసనన్ ( Adipurush heroine Kriti Sanon ) కనిపించబోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ముందు ప్రమోషన్ లు బాగా ముమ్మరంగా చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసం తిరుగుతూ ఉండగా కృతి సనన్ కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన మెంటాలిటీ గురించి.. సినిమా రంగంలో తన అనుభవాలు గురించి చెప్పుకుంటూ వచ్చింది. కృతి సనన్ ఢిల్లీ నుంచి వచ్చిన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.

See also  Ravanasura review rating: రావణాసుర రివ్యూ మరియు రేటింగ్

adipurush-heroine-kriti-sanon-decided-to-leave-movies-because-of-that-person-indecent-harassment

ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, మర్యాద, మన్నన అన్నీ ఉన్న కుటుంబం. ఇప్పటికీ బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్గా వెలుగుతున్నప్పటికీ.. నేను మాత్రం ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని అని మర్చిపోను అని కృతి సనన్ చెప్పుకుంటూ వచ్చింది. అలాగే మోడల్ గా ( Adipurush heroine Kriti Sanon ) మొదలుపెట్టిన నా జీవితంలోకి నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయని చెప్పుకుంటూ వచ్చింది. ఇక తెలుగు సినిమా రంగంలో అయితే మొదట మహేష్ బాబుతో నేనొక్కడినే అనే సినిమా నటించగా.. అది సరైన రిజల్ట్ ఇవ్వకపోవడంతో.. తర్వాత దోచే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించానని చెప్పింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో తెలుగు సినిమాల్లో ఇక నటించలేదని చెప్పుకొచ్చింది.

See also  Nandamuri Balakrishna - Taraka Ratna: బాలయ్య, తారకరత్న ల గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్...

adipurush-heroine-kriti-sanon-decided-to-leave-movies-because-of-that-person-indecent-harassment

అయితే తన సినిమా రంగంలో అడుగుపెట్టడానికి ముందు మోడలింగ్ చేసి.. బీటెక్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి ముంబాయికి వెళ్లానని.. అక్కడ రెండేళ్ల పాటు ఒంటరిగా ఉండి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చానని.. ముందు యాడ్స్ లో నటించి, ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇకపోతే ( Adipurush heroine Kriti Sanon ) కెరియర్ స్టార్టింగ్ లో చాలా అవమానాలు పడ్డారని.. అవన్నీ ఓర్చుకుని బరిస్తేనే ఇక్కడ వరకు వచ్చానని చెప్పుకుంటూ వచ్చింది. ఒకసారి ఒక ర్యాప్ షోలో కొరియోగ్రాఫర్ తనని చాలా అసభ్యంగా వేధించాడని.. దానితో ఇక మోడలింగ్, సినిమాలు అన్నిటికీ గుడ్ బై చెప్పేసి.. ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఆ క్షణం తనకి చాలా బాధ కలిగిందని చెప్పింది.

See also  Upasana - Mega Princess : స్టార్స్ అందరూ మెగా ప్రిన్సెస్ గురించి అపోలో లో చేసిన సందడి వైరల్..

adipurush-heroine-kriti-sanon-decided-to-leave-movies-because-of-that-person-indecent-harassment

ఆ తర్వాత కృతి సనన్ తల్లి తనకి ధైర్యం చెప్పిందంట. ఆడపిల్లకి ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక ధైర్యం లేకపోతే చాలా కష్టమని.. ఇలాంటి వాటికి భయపడి నీ ప్రొఫిషన్ ని నిందిస్తూ.. కెరియర్ని వదులుకోకూడదని చెప్పిందంట. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని.. అన్ని కష్టాల్ని, అవమానాలను ఎదుర్కొని.. దేన్ని పట్టించుకోకుండా నా కెరియర్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేసి.. పని చేసుకుంటూ రావడం వలన ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని గర్వంగా చెప్పుకొచ్చింది. దీనితో ప్రభాస్ అభిమానులు, కృతి సనన్ అభిమానులు ఎంతో సంతోషించారు. అలాంటి ఉత్తమైన కృతి సనన్ కి ఈ రోజు ఆదిపురుష్ లాంటి గొప్ప సినిమాలో జానకి పాత్ర నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని నెటిజనులు అంటున్నారు..