Home Cinema Adipurush : ఆదిపురుష్ పై ఇన్ని నెగటివ్ కామెంట్స్ రావడానికి కారణం ప్రభాస్ నిర్ణయమా?

Adipurush : ఆదిపురుష్ పై ఇన్ని నెగటివ్ కామెంట్స్ రావడానికి కారణం ప్రభాస్ నిర్ణయమా?

adipursh-gets-negative-comments-because-of-prabhas-decision

Adipurush : అలా అలా సాగుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాహుబలి అనే సినిమా ఒకటి వచ్చి ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. అక్కడ నుంచి మొదలైన తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదల చాలా ఫాస్ట్ గా వెంట వెంటనే ఇంకా మంచి రూపం దాల్చుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాని ( Adipursh gets negative comments ) ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టేజి మీద నాటు నాటు అంటూ డాన్స్ వేయించి.. విజిల్స్ వేయించి, పాటలు పాడించే లెవెల్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ వెళ్లడం నిజంగా ప్రతి తెలుగు వాడి గర్వకారణం. అలాంటి సినిమాకి హీరో ప్రభాస్ పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా మొదటి సినిమా అంటే బాహుబలి అని.. ఆ బాహుబలిలో హీరో ప్రభాస్ అని.. దర్శకుడు రాజమౌళి అనే చెప్పుకుంటూనే ఉంటారు.

adipursh-gets-negative-comments-because-of-prabhas-decision

ఈరోజు ప్రభాస్ సినిమా తీయాలంటే దాన్ని వరల్డ్ వైడ్ గా పనికొచ్చేలా తీయాలని ప్రపంచం అంతా రిలీజ్ చేసుకుని సంపాదించుకోవాలని.. ఆ దిశగానే కథలు రాసుకొని, ఆదిశగానే ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని, ఆ దిశగానే సినిమాను అంత బడ్జెట్ లో తీస్తున్న లెవెల్ కి వచ్చాడు ప్రభాస్ అంటే కేవలం బాహుబలి సినిమా సక్సెస్ ( Adipursh gets negative comments ) అనే గట్టిగా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రభాస్ బాహుబలి తర్వాత రెండు సినిమాలు పెద్ద సక్సెస్ ని సాధించలేకపోయాయి. దానికి కారణం ఏదైనా కావచ్చు గాని ప్రబాస్ మీద మాత్రం యాంటీ ఎవరికి రాలేదు. ఇప్పటికి ప్రభాస్ సినిమా అంటే అంతే క్రేజీగా, అంతే ఆసక్తిగా, అంతే అంచనాలతో ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఆదిపురుష్ సినిమా మొదల నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయిన, ఒక టీజర్ రిలీజ్ అయిన, ఒక ట్రైలర్ రిలీజ్ అయినా కూడా అందులోంచి ఏదో ఒక నెగిటివ్ పాయింట్ అనేది మాత్రం బయటికి వస్తుంది. 700 కోట్ల బడ్జెట్ అయినా కూడా ఎవ్వరికి సంతృప్తి లేదు.

See also  Pawan Kalyan : ఓం లాకెట్, కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం మీనింగ్ తెలుసా ?

adipursh-gets-negative-comments-because-of-prabhas-decision

తెలుగు స్టార్ హీరో కృష్ణంరాజు వారసుడిగా.. తెలుగు పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. ఒక తెలుగు దర్శకుడు రాజమౌళి క్రియేషన్తో తయారైన ఒక బాహుబలి లాంటి గొప్ప సినిమా.. తెలుగు వాళ్ళందరూ ఆ సినిమాని గ్రాండ్ సక్సెస్ చేసి.. ఆ ఖ్యాతిని భారతదేశమంతా చాటేలా చేసి.. ఇవన్నీ ప్రభాస్ అందుకున్నది తెలుగు వాళ్ళ నుంచే. అలాంటిది ఈరోజు రామాయణం అనే గొప్ప కథని.. రామాయణం యావత్ భారతదేశానిది.. కానీ ప్రభాస్ మాత్రం తెలుగువాడు. ఆదిపురుష్ నిజంగా అంత గ్రాండ్ సక్సెస్ అయితే.. ఆదిపురుష్ సినిమా ( Adipursh gets negative comments ) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో మిగిలిపోతుంది. ప్రపంచమంతా శ్రీరాముడు అనగానే ప్రభాస్ ని గుర్తు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే.. దర్శకుడు ఓం రైత్ ను గుర్తుతెచ్చుకుంటారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు.. తెలుగు సినిమాలో హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు అందరిని మెచ్చుకుంటూ ప్రపంచం మొత్తం ఇటు చూస్తున్న తరుణంలో.. ఈ క్రెడిట్ మొత్తం మళ్లీ ఒక హిందీ దర్శకుడికి, బాలీవుడ్ కి వెళ్ళిపోతుంటే..

See also  Prabhas - Raviteja : రవితేజ మిస్ చేసుకున్న ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఏమిటో తెలిస్తే అయ్యయ్యో అంటారు..

adipursh-gets-negative-comments-because-of-prabhas-decision

ఎక్కడో తెలుగు వాడికి ఏమైనా చిన్న బాధ ఉంటుందా? లేక ఒక హిందీ దర్శకుడు తీయడం వలన సినిమాలో తెలుగుదనం మిస్ అయిపోవడం వల్లనా.. అందుకే తెలుగు వాళ్ళకి ఆ సినిమాలో ఏదో ఒక లోపం కనిపిస్తుందా? మనసుకి హత్తుకోవడం లేదా నచ్చడం లేదా? లేదా ఆ సినిమాలో అందరూ హిందీ ఆర్టిస్టులే ఉండడం, కేవలం ఒక్క ప్రభాస్ మాత్రమే తెలుగు ఆర్టిస్ట్ ఉండడం వల్ల సినిమాలో ఏదో ఒక లోపం కనిపిస్తుందా ? ఇలా ఆదిపురుష్ నెగటివ్ కామెంట్స్ రావడానికి కారణమేమిటి అని నెటిజనులు ఆలోచనలోంచి ఇలాంటి అనుమానాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి.. ప్రభాస్ ఇంత మంచి అదృష్టకరమైన కాన్సెప్ట్ ని.. తెలుగు దర్శకుడు తో కాకుండా హిందీ దర్శకుడు తో కనెక్ట్ అవ్వడం.. ప్రభాస్ ఆ నిర్ణయంలో ఏదైనా తప్పు ఉందా? ఏదేమైనా తెలుగు, హిందీ, టాలీవుడ్, బాలీవుడ్ ఇలాంటివన్నీ లేకుండా ఆదిపురుష్ సినిమా సూపర్ డూపర్ హిట్ గట్టిగా కొట్టాలని కోరుకుందాం..