Tollywood heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అప్పటికంటే ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. గతంలో బాలీవుడ్ కి ఉన్నంత క్రేజ్ టాలీవుడ్ కి లేదు. ఒక హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకోవాలన్నా, ఒక గొప్ప స్థాయిలో ఉండి.. మంచి స్థానం కల్పించాలన్నా.. దెంట్లోనైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ( Who are the highest remuneration ) అంత వెలుగు లేదు. అలాంటిది రాజమౌళి లాంటి దర్శకుడు ఎంటర్ అయ్యి.. తెలుగు సినిమా ఇండస్ట్రీని కేవలం బాలీవుడ్ వరకే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు గర్వించే విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకెళ్లిన గొప్ప దర్శకుడు రాజమౌళి. ఎప్పుడైతే ప్రతి భాషలో తెలుగు సినిమా రిలీజ్ అవ్వడం మొదలైందో.. అక్కడ నుంచి తెలుగు హీరోల ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పాకుతుంది.
ఇంతకుముందు భారతదేశం మొత్తం హిందీ హీరోలు మాత్రమే అందరికీ తెలిసేవారు. ఇప్పుడు తెలుగు హీరోలు కూడా మొత్తం భారతదేశ అంతటికి తెలియడానికి కారణం.. పాన్ ఇండియా అనే ఒక కొత్త కాన్సెప్ట్ రావడమే. ఒక తెలుగు సినిమాని ( Who are the highest remuneration ) ఇండియా లెవెల్లో తీయడం వలన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుగు హీరో సత్తా తెలుస్తుంది. దీనితో ఇప్పుడు బాలీవుడ్ సైతం మన తెలుగు హీరోల వైపు కన్నెత్తి చూస్తున్నారు. హీరోలుగా గాని, కనీసం విలన్లుగా కానీ ఏ పాత్రలోనైనా తీసుకోవడానికి మన తెలుగు హీరోల వెనక పరుగులు పెడుతున్నారు. అప్పట్లో తెలుగులో ఎంత బాగా సక్సెస్ అయితే బాలీవుడ్ లో అడుగు పెట్టచ్చు అని అక్కడి కెరియర్ మొదలవ్వాలని మన తెలుగు హీరోలు,
హీరోయిన్స్, నటీనటులు తాపత్రయపడే రోజుల్లోంచి.. వాళ్ళే మన దగ్గరికి వచ్చి మీరు మా దాంట్లో నటించండి అని అడిగే లెవల్ కి ఎదగడం మన తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు.. ఈరోజు మన తెలుగు వాళ్ళందరూ గర్వించే విధంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా ఒకప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ లో వాళ్లు ( Who are the highest remuneration ) మాత్రమే గట్టి రెమ్యునిరేషన్ తీసుకోగలిగేవారు. కానీ ఇప్పుడు తెలుగు హీరోలు రెమ్యూనరేషన్ కూడా చాలా గట్టిగా పెరిగింది. రజనీకాంత్ 2007లో శివాజీ సినిమాకు 26 కోట్లు అందుకుంటే.. ఇప్పుడు జైలర్ సినిమా కోసం 150 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అలాగే కమల్ హాసన్ ఇండియన్ టు సినిమా కోసం కమలహాసన్ కూడా 150 కోట్లు పారితోషం తీసుకుంటున్నట్టు సమాచారంఉంది. ఇక మన పాన్ ఇండియా స్టార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొదటిసారిగా పాన్ ఇండియా హీరోగా ఎంటర్ అయిన మన ప్రభాస్ 150 కోట్లు పారితోషం తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు విజయ్ 150 కోట్లు, అల్లు అర్జున్ 110 కోట్లు, రామ్ చరణ్ 100 కోట్లు, ఎన్టీఆర్ 80 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మన తెలుగు హీరోలు ఇంత స్థాయికి ఎదగడం తెలుగు సినీ అభిమానులందరూ ఆనందంతో గర్వించదగ్గ విషయం.