Samantha : స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏం మాయ చేసావే సినిమాతో నాగచైతన్య సరసన హీరోయిన్గా నటించి మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ అందరిని తన అభిమానులు చేసుకున్న గొప్ప నటి సమంత. ఆ సినిమా దగ్గర నుంచి చైతుతో మంచి ( Samantha attempt suicide so many times ) రిలేషన్ ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమించుకుని ఏడు సంవత్సరాల పాటు ఆ ప్రేమను కొనసాగించి.. ఆ తర్వాత అక్కినేని కుటుంబాన్ని ఒప్పించి.. అక్కినేని నాగార్జునకు కోడలిగా, అక్కినేని నాగచైతన్యకు భార్యగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది. అప్పటివరకు ఆవిడ జీవిత విధానం ఒకలా ఉంటే.. పెళ్లి తర్వాత మరో మలుపు తిరిగింది. నాగచైతన్య సమంతల పెళ్లి సినీ రంగంలో, అభిమానుల్లో అందరికీ గుండెల్లో ఒక ఆనందాన్ని కలిగించింది.
చూడముచ్చటైన ఈ జంటను చూసి అందరూ మన తెలుగు సినీ తారల్లో ముచ్చటైన జంట ఒకటిగా నాగచైతన్య, సమంత గురించి చెప్పుకునేవారు. ఇలా వీళ్ళ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా నాలుగేళ్ల వరకు గడిచింది. అంతే ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కొన్ని సమస్యలు కలిగి ఒకరికి ఒకరు దూరమై విడాకులు ( Samantha attempt suicide so many times ) తీసుకునేంతవరకు వెళ్లి.. చివరికి విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి సమంత జీవితం ఇంకొక మలుపు తిరిగింది. విడాకుల తర్వాత సమంత తన కెరీర్ మీద ఎక్కువ శ్రద్ధను పెట్టుకుంటూ.. ఖాళీ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. కానీ మధ్యలో ఆమెకు అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఆరోగ్యం కుదుటపడిన వెంటనే ఆమె మళ్ళీ సినిమాల్లో నటిస్తూ తన ప్రయత్నం తాను చేసుకుంటూ పోతుంది. ఇటీవల రిలీజ్ అయిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అవడంతో కొంత డిసప్పాయింట్ అయినప్పటికీ.. ఆమె తన పయనం మాత్రం ఆపకుండా ఇంకా హుషారుగా ముందుకు వెళుతుంది. ఇలాంటి సమయంలో ( Samantha attempt suicide so many times ) సమంత గురించి ఒక ట్వీట్ చూసి నెటిజనులు ఆశ్చర్యపోయారు. ఇది నిజమేనా అంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు ఒక ట్వీట్ చేశాడు. ఇతను ఇప్పటికే సెలబ్రిటీస్ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూనే ఉన్నాడు.
అతను చెప్పిన దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయో లేదో తెలియదు గాని.. చెప్పే ప్రతిదీ మాత్రం సంచలనంగానే ఉంటుంది. అతను సమంత గురించి మాట్లాడుతూ.. సమంత నాగ చైతన్యని మర్చిపోలేక.. ఆ క్రమంలో సమంత చాలాసార్లు సూసైడ్ అటెండ్ చేసిందంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు సమంత ప్రస్తుతం డిప్రెషన్ లో ఉందని కూడా చెప్పాడు. ఇది చూసిన సమంత అభిమానులు ఎంత చైతూని మర్చిపోలేక పోతే మాత్రం.. సూసైడ్ చేసుకోవాల్సిన ఖర్మ ఎం పట్టింది? అని అంటున్నారు. అంతేకాదు ఆ ట్వీట్ చూసిన చైతు అభిమానులు కూడా ఏడుస్తున్నారు. మాకె ఇంత బాధగా ఉందంటే మా హీరో నాగచైతన్య మనసులో ఇంకెంత ఏడుస్తాడని వాళ్ళు వాపోతున్నారు. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇద్దరు కలిసి ఆనందంగా జీవించొచ్చుగా అని చెప్పుకుంటున్నారు.
Depressed Soul #SamanthaRuthPrabhu. As per insiders from her crew, She tried to do suicide many times & she is in very depression now a days. She is not feeling well. pic.twitter.com/Q1mYoLLdIa
— Umair Sandhu (@UmairSandu) June 3, 2023