Naresh – Pavitra Lokesh : నరేష్ పవిత్ర లోకేష్ వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియాలో వార్త వినని రోజంటూ లేదేమో.. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మీద ఏదో ఒక సెన్సేషనల్ వార్తలు చూస్తూనే ఉంటున్నాము. మళ్ళీ పెళ్లి అనే సినిమా కూడా తీసి అందులో వీళ్ళ నిజ జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాల ( Naresh encourage Pavitra Lokesh ) గురించి సినిమా తీయగా.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ.. ఈ జంట మాత్రం జనాలు కళ్ళల్లో సూపర్ హిట్ అయింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కనిపిస్తే చాలు ఏమి సమాచారమే అని వెంటనే చదివి ఏదో ఒక కామెంట్ చేస్తారు. అలా ఈ జంట మంచి ఫేమస్ అయింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యలను వదిలేసి మూడో భార్యతో డైవర్స్ అప్లై చేసుకున్న నరేష్ ఇప్పుడు పవిత్ర లోకేష్ ను చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.
ప్రజెంట్ వాళ్ళిద్దరూ సహజీవనంలో ఉన్నారు. వీళ్ళిద్దరిది స్వచ్ఛమైన ప్రేమని, ఒకరి మీద ఒకరికి బాగా క్యాన్సర్న్ ఉందని, ఒకరంటే ఒకరికి గౌరవం, అభిమానం, అని ఇష్టం ప్రేమ అని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నారు. అయినా పాపం వీళ్ళ మీద సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త రావడం.. దానిమీద ( Naresh encourage Pavitra Lokesh ) ట్రోల్ చేస్తూ ఉండడం రొటీన్ అయిపొయింది. మళ్లీ పెళ్లి సినిమాతో నరేష్ పాపం భారీగానే కోట్ల రూపంలో డబ్బు నైతే నష్టపోవడం జరిగింది. అయితే ఇంతకాలం నరేష్ పవిత్ర లోకేష్ ని ఏదో రకంగా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా చేసే నెటిజనులు ఒక విషయంలో మాత్రం నరేష్ పవిత్ర లోకేష్ ని పొగుడుతున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పవిత్ర లోకేష్ మాతృభాష కన్నడ అన్న విషయం మనందరికీ తెలిసిందే. కన్నడలో ఆమె తండ్రి కన్నడ లో నటుడు. ఆయన అడుగుజాడల్లో నడిచి, నటన నేర్చుకుని, సినిమా రంగంలో అడుగుపెట్టి.. ఎన్నో సినిమాలు నటించి.. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకొని.. అతనికి విడాకులు ఇచ్చి.. ఆ తర్వాత ఒకరితో సహజీవనం చేసి.. ఇద్దరు పిల్లలను కని.. ఇప్పుడు అతనిని వదిలేసి నరేష్ తో సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేష్ ( Naresh encourage Pavitra Lokesh ) ఇప్పుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. పవిత్ర లోకేష్ ప్రజెంట్ ఉన్న సమస్యలను పక్కనపెట్టి.. తన మాతృభాష అయిన కన్నడలో సాహిత్యంలో పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకుందట.
ఈ క్రమంలోనే పీహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కోసం.. బళ్లారి వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడ హంపి కన్నడ యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. అయితే పవిత్ర మనసులో కోరికను తెలుసుకొని, పీహెచ్డీపై మనసు పడిందని, మాతృభాష మీద గౌరవం చూపిస్తుందని, పవిత్రని పూర్తిగా అర్థం చేసుకున్న నరేష్.. స్వయంగా దగ్గరుండి మరి పరీక్ష రాయించడానికి దించి వచ్చి మళ్లీ తీసుకొని వచ్చారంట. ఈ విషయంలో మాత్రం నెటిజనులు వాళ్ళిద్దరిని పొగుడుతున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎన్ని కామెంట్ చేస్తున్నా.. వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించాలనుకున్నవి.. వాళ్లు మనసుపడిన వాటిని.. ఇష్టమైనవి వాళ్ళును సాధించుకుంటున్నందుకు పొగడక తప్పడం లేదు.