Home Cinema Very Interesting: చైతు – సామ్ ఆ ఒక్కటి వీళ్ళిద్దరూ దూరం పెడితే చాలు మళ్ళీ...

Very Interesting: చైతు – సామ్ ఆ ఒక్కటి వీళ్ళిద్దరూ దూరం పెడితే చాలు మళ్ళీ హయిగా కలిసిపోవచ్చు భార్యా భర్తల్లా..

Very Interesting News: తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టి అతి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా తన పాపులారిటీని దక్కించుకున్న హీరోయిన్ సమంత ఆ తర్వాత తనతో కలిసి నటించిన ఏం మాయ చేసావే చిత్రంలోని హీరో అక్కినేని నాగచైతన్యను అప్పటి నుంచి ప్రేమించి ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత వివాహం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక తెలుగులో ఏం మాయ చేసావే చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన సమంత తన తొలి చిత్రంతో మంచి విజయాన్ని కైవసం చేసుకుని తను ఏంటో నిరూపించుకుంది.

See also  National Award Allu Arjun : తొలి తెలుగు హీరోగా నేషనల్ అవార్డు తీసుకునేది అల్లు అర్జున్ కాదు.. ఎవరా హీరో ఎందుకీ ఫేక్ ప్రచారం!

very-interesting-news-about-naga-chaitanya-and-samantha-latest-updates

అలాంటి హిట్ ఇచ్చిన హీరోనే చాలా ఏళ్ల పాటు ప్రేమించి తన జీవిత భాగస్వామిగా చేసుకుని టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ పేరుగా గుర్తింపు తెచ్చుకొని కొన్నేళ్ల పాటు తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది. ఇక ప్రేమించుకోవడం అయితే దాదాపు పది సంవత్సరాల వరకు ప్రేమించుకుని ప్రేమించుకున్నారు. కానీ పట్టుమని నాలుగేళ్ల పాటు కూడా కాపురం చేయకుండా ఈ జంట ఇద్దరు ఎవరికివారు విడిపోయి విడాకులు తీసుకున్నారు.

very-interesting-news-about-naga-chaitanya-and-samantha-latest-updates

ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఎన్నో వచ్చినప్పటికీ.. అసలు సిసలైన కారణం ఇప్పటికీ తెలియదు. ఇక ఈ జంట గురించి ప్రతి రోజు నిత్యం ఏదో ఒక విషయం కచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతూనే ఉంటుంది. కానీ ఏ ఒక్క దానికి ఇటు సమంత గాని అటు చైతు గాని స్పందించరు. అలాగే ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ అక్కినేని అభిమానులు కోరుకున్నట్లే నిజంగా సమంత నాగచైతన్య ఇద్దరు ఒకటి కావాలంటే వాళ్ళ ఇగోనూ ఇద్దరూ పక్కన పెట్టాలి అంటున్నారు. (Very Interesting News)

See also  Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ తన తల్లికి ఇచ్చిన మాట వలన చాలామందికి దూరమయ్యాడట.. ఆ మాట ఏమిటంటే..

very-interesting-news-about-naga-chaitanya-and-samantha-latest-updates

ఓ వైపు అక్కినేని అభిమానులు మరో వైపు నెటిజన్లు కూడా.. కేవలం వీళ్లిద్దరికున్న ఈ ఇగోల కారణం చేతనే వీళ్ళు విడాకుల వరకు వెళ్లారని చెప్పుకొస్తున్నారు. ఇంటర్వ్యూలో కూడా నాగ చైతన్య మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల వల్లే మా మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని ఆ తర్వాత అవి చిన్న చిన్నగా అగ్గి రాసుకున్నట్టు రాసుకొని చివరికి తారస్థాయికి చేరి విడాకుల వరకు వెళ్లారని చెప్పుకొచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అలాంటి చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకున్న ఈ జంట ఆ పట్టింపులన్నీ పక్కనపెట్టి మళ్ళీ ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయ్ అంటున్నారు కొందరు అభిమానులు. మరి ఎదురు చూడాలి అభిమానుల కోసమైన ఈ జంట ఏం చేస్తారు అన్నది.