Pooja Hegde : ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య సరసన హీరోయిన్గా తొలి సినిమాతో అడుగుపెట్టిన పూజా హెగ్డే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చూడ్డానికి ఎంతో క్లాస్ గా అందంగా ఉండే పూజా హెగ్డే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని చాలా తొందరగానే కొట్టేసింది. పూజా హెగ్డే నటించే సినిమాల్లో తనకంటూ ( Pooja Hegde accepted to do ) ఒక మంచి పాత్ర ఉంటుంది. హీరోయిన్ కేవలం గ్లామర్ రోల్స్ గురించి మాత్రమే కాకుండా.. ఆమె పాత్రకు కొంత ప్రాధాన్యత చేచిక్కించుకునేలా ఉంటుంది. ఎన్టీఆర్ తో నటించిన అరవింద సమేత లో కూడా ఆమె పాత్ర బాగుంటుంది.
అలాగే అలవైకుంఠపురంలో కూడా ఆమె పాత్ర బాగుంటుంది. మేడం అంటూ అల్లు అర్జున్ ఆమె కాళ్ళ పైపు చూసే సీన్స్.. ఆ సినిమాలో చాలా బాగా పండాయి. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా ఆమె పాత్రకు ( Pooja Hegde accepted to do ) మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే.. ఇటీవల పూజా హెగ్డే నాలుగు డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. దీనితో సినిమా రంగంలో హిట్టు తగిలితే ఎంత స్పీడ్ గా, వరుసగా సినిమాలు దొరుకుతాయో.. ఒక డిజాస్టర్ కొడితే అంత స్పీడ్ గా ఆఫర్లు అనేవి దరిదాపుల్లోకి రాకుండా పోతాయి. ప్రస్తుతం పూజ హెగ్డే SSMB28 సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తప్పితే టాలీవుడ్లో ఆమెకు వేరే సినిమాలు ఏవి ఇంతవరకు బుక్ అవ్వలేదంట.
బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తుంది కానీ, ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అవ్వడం ఖాయం అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. నెక్స్ట్ ఆఫర్స్ ఇంతవరకు ఆమె దగ్గరికి కొత్తవి రాకపోతే.. నెక్స్ట్ ఆమె చేయాల్సిన పనేమిటి అనేవి ఒక ప్రశ్నార్థకమే. ఈ తరుణంలో ఆమె ఒక నిర్ణయం తీసుకుందని.. ఆ నిర్ణయం పై ( Pooja Hegde accepted to do ) నెటిజనులు చాలా గట్టిగా ఖండించడంతో సోషల్ మీడియాలో ఇది ఒక డిస్కషన్ అవుతుంది. పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించడానికి ఒప్పుకున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనితో ఎంత ఆఫర్స్ లేకపోతే మాత్రం ఎందుకంత అలాంటి పాత్రలు నటించడం? ఐటెం సాంగ్ లో నటించాల్సిన కర్మేముంది? అంటూ కొందరు కామెంట్లు చేశారు.
అయితే ఆఫర్లు లేని సమయంలో ఐటమ్ సాంగ్ లో నటిస్తేనే ఇన్ని మాట్లాడాల్సిన అవసరం ఉందా? స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో సమంత ఊ అంటారా ఊ ఊ అంటారా.. అంటూ ఐటమ్ సాంగ్ నటిస్తే, అప్పుడు మీరు ఎందుకు ఏమీ మాట్లాడలేదు అని ఇంకొందరు వాదిస్తున్నారు. అన్ని బాగున్న సమంత ఐటమ్ సాంగ్ చేసి పుష్పా లో అలరిస్తే.. అందరూ ఆదరించి ఆ సినిమానంత సూపర్ డూపర్ హిట్ చేస్తే.. ఏమీ బాగాలేని టైంలో పూజా హెగ్డే ఒక ఐటెం సాంగ్ చేసి.. ఒకవేళ నిజంగా సమంత లానే మంచి టాక్ తెచ్చుకొని.. బాలీవుడ్ రేంజ్ లో హాలీవుడ్ రేంజ్ లో ఏవైనా అవకాశాలు కొడితేనో? సమంత చేస్తే అది ఒప్పా? అదే పని పూజా హెగ్డే చేస్తే తతప్పా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.