Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఆయన పెళ్లి వార్తలతో.. అందరిని ఆనందపరుస్తూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. మే 27వ తారీకు రాత్రి శర్వానంద్ కి రోడ్డు ప్రమాదం జరిగిందని ( Hero sharwanand met with an accident ) మనందరికీ తెలిసిందే. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు భయాందోళనలో పడి విపరీతమైన టెన్షన్ పడ్డారు. ఇక శర్వానంద్ అభిమానులైతే.. వాళ్ల హీరోకి ఏమైంది అంటూ మెసేజ్ ల మీద మెసేజ్లు ఒకరికి ఒకరు చేసుకుంటూ ఎంతగానో భయపడ్డారు. హైదరాబాద్ ఫిలింనగర్ జంక్షన్ దగ్గర శర్వానంద్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణం చేస్తూ ఉండగా ఎదురుగా ఒక వెహికల్ రావడంతో, దాన్ని తప్పించుకునే క్రమంలో పక్కకు జరపగా యాక్సిడెంట్ జరిగింది.
ఈ యాక్సిడెంట్లో శర్వానంద్ కు తీవ్ర గాయాలు తగిలాయని, ప్రమాదకర స్థితిలో ఉన్నాడని, కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారని అనేక వార్తలు వచ్చాయి. దీనితో సర్వానంద అభిమానులు ఇటీవల శర్వానంద్ ప్రేమించిన ( Hero sharwanand met with an accident ) అమ్మాయి రక్షిత రెడ్డి తో ఎంతో వైభవంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంతో ఆనందంగా ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి వార్త కోసం అందరూ ఎదురు చూస్తుంటే.. ఇలాంటి క్రమంలో ఇలా జరగడం నిజంగా దురదృష్టకరమని బాధపడ్డారు. శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా చాలా రోజులపాటు పెళ్లి మీద ఎటువంటి డేట్ ఫిక్స్ చేసి, అనౌన్స్ చేయకపోవడంతో అఖిలానే వీలు కూడా విడిపోతారా అంటూ అనేక వార్తలు వచ్చాయి.
కానీ శర్వానంద్ సోదరి వేరే దేశంలో ఉందని, ఆమె వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో శర్వానంద్ ఉన్నాడని.. అతి తొందర్లోనే ఆమె వస్తుందని.. అప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటారని ఆయన టీం చెప్పడంతో.. అభిమానుల ఆనందపడ్డారు. శర్వానంద్ కి ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ జరగగానే.. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత పెళ్లిలోపు ఇలా జరిగిందంటే ఆ అమ్మాయి లెగ్ మంచిది కాదని.. వాళ్ళిద్దరి జాతకం చూసారా లేదా అని, అసలు ఆ అమ్మాయి జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో.. చేసుకోబోయే అమ్మాయి అదృష్టాన్ని బట్టే మగోడు జీవితం ఉంటుందని.. అందుకే ఇలా అయ్యిందని కొందరు చాదస్తం ఉన్నవాళ్లు కామెంట్లు చేశారు.
నిజానికి శర్వానంద్ కి రోడ్డు ప్రమాదం అయితే జరిగింది కానీ.. పెద్ద గాయాలు అయితే ఏమీ తగల్లేదు.. చిన్న చిన్న గాయాలతో ఆయన బాగానే ఉన్నారు అంటూ తరవాత వార్తలు వచ్చాయి. దీనితో శర్వానంద్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు పెద్ద ప్రమాదం ( Hero sharwanand met with an accident ) జరక్కుండా శర్వానంద్ బయట పడటం అదృష్టం అని.. అతనికి కాబోయే భార్య అదృష్టం వలనే ప్రాణ ప్రమాదం జరక్కుండా ఉంటాడని అని అనుకోవచ్చుగా అంటూ అభిమానులు అంటున్నారు. అలాంటిది తన ఆక్సిడెంట్ కి తాను ఎంతో ప్రేమించి తెలుసుకోబోతున్నా తన కాబోయే భార్య మీద.. కొందరు చాదస్తపు అబాండాలు వేయడం వలన.. శర్వానంద్ కి రోడ్డు ప్రమాదం వల్ల తగిలిన గాయం కంటే.. ఇలాంటి మాటలు విని తన గుండెకు తగిలిన గాయమే పెద్దదని ఫీల్ అవుతాడని ఆయన అభిమానులు వాపోతున్నారు.