Home Cinema Chiranjeevi : చిరంజీవి దర్శకత్వంలో సినిమా.. హీరో ఎవరో తెలుసా?

Chiranjeevi : చిరంజీవి దర్శకత్వంలో సినిమా.. హీరో ఎవరో తెలుసా?

chiranjeevi-directed-only-one-movie-in-his-life-what-is-that-movie

Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో నటీనటులు, దర్శకులు, కెమెరామెన్ లు, ఎడిటర్లు ఇలా ఎందరిదో సమూహం కలిపితేనే సినిమా అవుతుంది. అయితే ఇంతమంది కలిసి ఒక టీం గా ఒక సినిమాని చేస్తే.. దానికి ముఖ్యంగా పేరు వచ్చేది మాత్రం దర్శకుడికి, హీరోకి . అలాగే సినిమా బాగోకపోయినా కూడా బాగా తిట్టేది మాత్రం ఫస్ట్ దర్శకుని ( Chiranjeevi directed only one movie ) తర్వాత హీరోని. మిగిలిన వాళ్ళందరికీ అంత ఎఫెక్ట్ ఉండదు. అలాగే దర్శకత్వం అనేది అందరికీ ఒక ఛాలెంజింగ్ గా, చాలా ఇష్టంగా ఉంటుంది. చాలామంది నటీనటులు నటించిన కొంతకాలానికి దర్శకులు అవ్వాలని కోరుకుంటారు. అలాగే కెమెరామెన్ ఎవరైనా కూడా దర్శకత్వం చేయడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. అదే దర్శకత్వంలో ఉన్న గొప్పతనం.

chiranjeevi-directed-only-one-movie-in-his-life-what-is-that-movie

గతంలో ఎవరు చేసే పని వాళ్ళే చేసేవారు. హీరో అంటే.. వాళ్ళు హీరో పాత్రలే చేసుకునేవారు. విలన్ అంటే.. విలన్ పాత్రలే చేసేవారు. కమెడియన్ కమెడియన్ గానే ఉండేవాడు. అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న చేంజ్ జరగచ్చు. దర్శకుడు దర్శకత్వమే వహించేవాడు కానీ.. ఇప్పుడు అలా కాదు. ఒక హీరో ఉంటే.. అతనే ( Chiranjeevi directed only one movie ) దర్శకత్వం చేసుకొని, అతనే హీరోగా నటించేసి.. ఇలా మల్టీ టాలెంట్ తో అన్ని టాలెంట్లని ఒకే దాంట్లో చూపిస్తూ.. ఎవరికి వారు ముందుకు ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి జనరేషన్ వాళ్ళని చూస్తే.. అప్పటివళ్లకు నేను కూడా అదే అలా ట్రై చేయాల్సింది కదా అని ఎక్కడో ఒక మూల అనిపించే అవకాశం లేకపోలేదు.

See also  Sreeleela : శ్రీలీలను కోరిక తీర్చమంటూ అసభ్యకర మెసేజ్లు చేస్తున్నది ఆ వ్యక్తా?

chiranjeevi-directed-only-one-movie-in-his-life-what-is-that-movie

అయితే మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి సపోర్టు లేకుండా అడుగుపెట్టి, తనదైన శైలిలో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసి, తనకంటూ ఒక అగ్రస్థానాన్ని స్థాపించుకున్న గొప్ప నటుడు మెగాస్టార్ చిరంజీవి. అటువంటి చిరంజీవి సినిమా హీరోగా అలాగే ఒక పొలిటిషన్ గా మనకు బాగా తెలుసు. కానీ చిరంజీవి దర్శకత్వం వహించిన సినిమా లేదు.. అయినా ముందు ముందు చేస్తారో లేదో తెలియదు అని ( Chiranjeevi directed only one movie ) అందరూ డిసైడ్ అయిపోయారు. కానీ మెగా అభిమానులకి సినీ అభిమానులకి తెలియని విషయం ఏమిటంటే.. ఒక సినిమాలో చిరంజీవి కూడా డైరెక్షన్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే 1995లో రిలీజ్ అయిన బిగ్ బాస్. చిరంజీవి హీరోగా, రోజా హీరోయిన్గా, విజయబాపినీడు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో చిరంజీవి ఒకసారి కాల్షీట్ ప్రకారం షూటింగ్ వెళ్ళగా.. కొన్ని కారణాల వలన దర్శకుడు విజయబాపినీడు రాలేదంట.

See also  Nayanathara : డబ్బు కోసం నయనతార తో ఆమె భర్త అంత నీచమైన పని చేయిస్తున్నాడా?

chiranjeevi-directed-only-one-movie-in-his-life-what-is-that-movie

దర్శకుడు అందుబాటులో లేనందువలన ఇక షూటింగ్ ఆపేద్దామని అందరూ అనుకునే పరిస్థితుల్లో.. చిరంజీవి అలా వద్దు నేను డైరెక్షన్ చేస్తానని దర్శకుడు కుర్చీలో కూర్చొని షూటింగ్ పూర్తి చేశారని.. పైగా ఆ సీన్ కూడా ఫైట్ రిలేటెడ్ సీన్. ఇక ఫైట్స్ అనగానే మన మెగాస్టార్ రెచ్చిపోతాడు కదా.. డాన్స్, ఫైట్స్ లో ఆయన్ని మించిన వాళ్లు ఇప్పటికీ లేరని చెప్పుకోవాలి. అలాంటిది ఆయన దర్శకత్వంలో.. ఆ ఫైట్ సీన్ కంప్లీట్ చేయబడిందంట. ఈ విషయాన్ని ఆ సినిమాలో కీలక పాత్ర పోషించిన తనికెళ్ల భరణి ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. అంటే చిరంజీవి కూడా దర్శకత్వం వహించిన సినిమా అనేది ఒకటి ఉందన్నమాట. పైగా ఆ సినిమాలో హీరో ఆయనే అంటే ఇప్పుడు మల్టీ ట్యాలెంట్ చూపించే వాళ్ళ లాగా చిరు కూడా అప్పట్లోనే చూపించినట్టే అని సరదాగా చెప్పుకుంటూ నెటిజనులు అనుకుంటున్నారు.