Home Cinema Vijayashanti: ఎన్టీఆర్ ఫోన్ చేసి మరి విజయశాంతికి ఐ యాం వెరీ సారీ అని చెప్పాడు....

Vijayashanti: ఎన్టీఆర్ ఫోన్ చేసి మరి విజయశాంతికి ఐ యాం వెరీ సారీ అని చెప్పాడు. అసలేమైంది అంటే..

Vijayashanti: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి వేడుకలు మే 28 వ తారీకున జరగబోతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఒక్కో వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వస్తుంది. అందులో భాగంగానే లేడీ అమితాబచ్చన్ విజయశాంతి గారు ఎన్టీఆర్ (Ntr apologies) ను గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. మరి అదే విధంగా ఆయనతో ఉన్న అనుబంధాలను, జ్ఞాపకాలను ఆమె తలుచుకుంటూ తన సోషల్ మీడియా వేదికగా ఓ విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగానే ఓ విషయాన్ని షేర్ చేస్తూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారు నేను చిన్న పిల్లగా కేవలం 14 సంవత్సరాల వయస్సులో..

ntr-apologies-to-vijaya-shanthi-for-doing-like-that

నా సినీ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించిన కొత్తలో సత్యం శివం అనే చిత్రంలో చెల్లెలి పాత్రలో ఎన్టీఆర్ గారితో మరదే విధంగా ఏఎన్ఆర్ గారితో కలిసి నటించే అవకాశం లభించడం నా అదృష్టం అంటూ తెలిపారు. ఇక ఆ తర్వాత 1985 సంవత్సరంలో వచ్చిన ప్రతిఘటన చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డుకు ఎంపికయ్యాను. ఇక ఆ అవార్డును నేను స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అవార్డును అందుకున్నాను. అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నంది అవార్డు కైవసం చేసుకున్న నన్ను అభినందించి ఇలాగే ప్రజా ప్రయోజత సినిమాలు మరెన్నో చిత్రాలలో నటించి మరింత ముందుకు కొనసాగాలని నన్ను ఎన్నో మంచి మాటలతో ఆశీర్వదించాడు.

See also  Simran: చూడ్డానికి పద్దతిగా కనిపించే సిమ్రాన్ ఇంత మంది హీరోలతో ఎఫైర్ కొనసాగించిందా.?

ntr-apologies-to-vijaya-shanthi-for-doing-like-that

నటుడిగా, నాయకునిగా తిరుగులేని జీవిత ప్రస్థానాన్ని కొనసాగించిన ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే.. ఇంకా ఇదే కాకుండా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా డబ్బింగ్ చెప్పే సమయంలో ఒక రోజు ఎన్టీఆర్ గారు ఏబీఎన్ స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్నప్పుడు నేను అదే స్టూడియోలో 1990లో చిరంజీవి గారితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ వారి డబ్బింగ్ థియేటర్లో కలవడానికి వెళ్లాను. కాగా ఆ గది మొత్తం చీకటి వాతావరణం లో ఉండగా.. వారు నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను.. ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఎన్టీఆర్ గారు స్వయంగా ఉదయాన్నే ఆరు గంటలకే మద్రాస్ లో ఉన్న మా ఇంటికి విచ్చేశారు.

See also  Bro Movie Distributors Review : బ్రో సినిమా చూసిన డిస్టిబ్యూటర్స్ రివ్యూ చెప్పాశారు, వైరల్ అవుతున్న స్టోరీ.

ntr-apologies-to-vijaya-shanthi-for-doing-like-that

కానీ నేను అప్పటికే ఫ్లైట్ ఎక్కి షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చాను. ఆయన మా ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకోలేదు పొరపాటు జరిగింది ఐ యాం సారీ నా బిడ్డకు (Ntr apologies) తెలియజేయండి అంటూ.. శ్రీనివాస్ ప్రసాద్ గారితో చెప్పిన సంఘటన నేను బ్రతికి ఉన్నంత వరకు గుర్తుంటుంది. మరదే.. కాకుండా హైదరాబాదులో నేను ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు స్వయంగా నా ఫోన్ నెంబర్ తెలుసుకొని మరి నాకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందమ్మా ఐ యాం ఎక్స్ట్రీమ్లీ సారీ అని తెలిపి సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించి ఆ మహోన్నతమైన వ్యక్తిని ఎంత ప్రశ్నించినా తక్కువే అంటూ ఆమె తెలిపారు. అందుకే ఎన్టీఆర్ గారు చరిత్ర ఉన్నంతకాలం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో.. ప్రేక్షకుల మనసుల్లో.. నిలిచిపోతారంటూ విజయశాంతి తెలిపింది.