2023 SIIMA Awards : 2023 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఎన్నో సినిమాలు ఎంతోమంది నటీనటులు ఎన్నికవ్వడం జరిగింది. 2023 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ( 2023 SIIMA Awards ) ఎవరెవరికి ఏ క్యాటగిరీలో ఎలాంటి అవార్డ్స్ వచ్చాయో తెలుసుకుందాం. అవార్డ్స్ లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా గొప్ప ఫలితాలను పొందింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా సంచలనాన్ని క్రియేట్ చేసి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ ను సాధించుకుంది. దానితోపాటు ఇప్పుడు 2023 అవార్డ్స్ లో కూడా తన సత్తాను చాటింది.
2023 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఐదు అవార్డ్స్ ను సాధించుకుంది. ఈ సినిమాలో హీరో నుంచి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ వరకు అవార్డ్స్ ను సాధించుకుంది. ఈ సినిమా ( 2023 SIIMA Awards ) దర్శకుడు రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉండగా.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక 2023 సైమా అవార్డ్స్ లో ఏ ఏ క్యాటగిరి లో ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయో ఒక్కసారి చూద్దాం..
2023 సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటిగా ధమాకా సినిమాలో చేసిన హీరోయిన్ శ్రీలీలకు దక్కింది. అలాగే ఉత్తమ విలన్ గా హిట్ 2 సినిమాలో విలన్ గా చేసిన సుహాన్ కి అవార్డు దక్కింది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి కి అవార్డు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడుగా కీరవాణి, ఉత్తమ సాహిత్య అవార్డు గ్రహీతగా చంద్రబోస్ లకు ఈ అవార్డు ( 2023 SIIMA Awards ) దక్కింది. ఇక ఉత్తమ సినిమా అవార్డు సీతారామన్ సినిమాకు దక్కింది. అలాగే క్రిటిక్స్ నుంచి ఉత్తమ నటుడి అవార్డు మేజర్ సినిమాలో హీరోగా నటించిన అడవి శేషుకు దక్కింది. అలాగే ఉత్తమ సహాయ నటుడుగా వసూద సినిమాలో సంగీతకి దక్కింది. అలాగే కార్తికేయ 2 సినిమాకి సెన్సేషన్ ఆఫ్ ద ఇయర్ గా అవార్డు అందుకుంది.
ఉత్తమ ఛాయా గ్రహకుడి అవార్డుగా సెంథిల్ కుమార్ కు ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా వచ్చింది. క్రిటిక్స్ నుంచి ఉత్తమ నటిగా సీతారామం సినిమా నుంచి మృణాళి ఠాకూర్ అందుకుంది. కేవలం ఒక అవార్డు మాత్రమే కాకుండా సీతారామం సినిమా నుంచి బెస్ట్ డెబ్యూ గా మృణాళి ఠాకూర్అవార్డు అందుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా భీమ్లా నాయక్ సినిమా నుంచి రానా అందుకున్నాడు. ఉత్తమ కమెడియన్గా కార్తికేయ 2 సినిమా నుంచి అందుకు శ్రీనివాస్ రెడ్డి అందుకున్నాడు. ప్రామిసింగ్ స్టార్ గా బెల్లంకొండ గణేష్ కి, యూత్ ఐకాన్ స్టార్ గా శృతిహాసన్ కి అవార్డ్స్ లు వచ్చాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాటగిరిలో అవార్డ్స్ వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఐదు అవార్డ్స్ రావడం అంటే నిజంగా ఎంత స్పెషల్ ఆ సినిమా అని అర్థమవుతుంది..