
2000 notes : 2016వ సంవత్సరంలో భారత ప్రధాన మంత్రి మోడీ గారు అవినీతిని , నల్లధనాన్ని , అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బుని అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దు అనగా 500,1000 రూపాయల నోట్లని రద్దు ( 2000 notes were the main ) చేసిన విషయం మన అందరికీ తెలుసు. కానీ అదే సమయంలో వాటికంటే పెద్ద నోటు అయిన 2000 రూపాయల నోటుని అతి తక్కువ సమయంలోనే రిలీజ్ చేయడం అనేక విమర్శలకి అవకాశం ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే.. ఉదాహరణకి లంచం రూపంలో ఒక అయిదు లక్షల రూపాయలని 500,1000 నోట్ల రూపంలో తీసుకోవడం కన్నా, 2000 రూపాయల నోట్ల రూపంలో తీసుకోవడం ఇంకా ఈజీ , దాచుకోవడం , క్యారీ చేయడం చాలా సులభం.
ఇక్కడే జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు..
కానీ ఆనాడు 2000 నోటు రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం జనాలకి సరిపడా 500,1000 నోట్లు ప్రింట్ చేసి ఇచ్చే పరిస్థితి లేక, రవాణా చేసే వ్యవస్థ అప్పటికప్పుడు అందుబాటులో లేక తప్పని పరిస్థితిలో 2000 రూపాయలని RBI ప్రింట్ చేసి జనాలకి తగినంత ధనం అందుబాటులోకి తీసుకుని వచ్చింది. అప్పట్లో నోట్ల మార్పిడి కోసం జనాలు బ్యాంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ బార్లు బార్లుగా నిలబడి గంటలు గంటలు నిల్చోని ( 2000 notes were the main ) తమ సొమ్ముని మార్చుకోవాల్సి వచ్చింది… ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం మీద వ్యతిరికత అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో 2000 రూపాయలని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అయితే చాల మంది జనాలకి తెలియని విషయం ఏమిటంటే.. 2000 రూపాయల నోట్ల ప్రింటింగ్ 2017 సంవత్సరం నాటికే దాదాపుగా ఆపేసినట్టు RBI చెబుతోంది, కేవలం 11%మాత్రమే 2018-2019 సమయంలో ప్రింట్ చేసినట్టు చెబుతున్నారు.
అనగా 89% 2017 సంవత్సరంలోనే ఆపేసినట్టు RBI క్లియర్ గా చెపుతోంది. అంతేగాక జనాలు 2000 నోట్లని బ్యాంకు లో డిపాజిట్ చేసిన వాటిని చేసినట్టే తమ వద్దే పెట్టుకుని వాటి బదులు జనాలకి ఇచ్చేటప్పుడు ఇతర నోట్లు ఇవ్వడం, ఎటిఎం లలో సైతం 2000 నోటు లేకుండా చేస్తూ.. సాధ్యమైనంత వరకు 2000 రూపాయల ( 2000 notes were the main ) నోటు చెలామణి లో లేకుండా చేసుకుంటూ RBI వచ్చింది. ఇప్పుడు జనాలు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్ల ని 2023 సెప్టెంబర్ 30 లోపు బ్యాంక్స్ చచ్చినట్టు వెళ్లి బతుకు జీవుడా అంటూ.. మళ్ళీ క్యూ లైన్లో నిల్చొని బ్యాంక్స్ వాళ్లు ఇచ్చే నోట్లని తెచ్చుకోవాలి ! అదికూడా ఇరవై వేల రూపాయలు వరకు మాత్రమే. కాకపోతే ఇది సామాన్యులకి వర్తించే రూల్, సామాన్యులు చచ్చినట్టు ఫాలో కావాల్సిన రూల్..
అదే అవినీతి పరులు, అధికారం వున్నా వాళ్లు బ్యాంకు మేనేజర్స్ ని మ్యానేజ్ చేయగలిగిన వాళ్లకి ఇవేం అవసరం లేదు. సూట్కేసులు సూట్కేసులుగా నేరుగా వాళ్ల ఇళ్లకే డబ్బు వెళుతుంది. నాటి పెద్ద నోట్ల రద్దు సమయంలో కొంత మంది మహానుబావుల ఇళ్లకి, కార్యాలయాలకి కొత్తగా ప్రింట్ చేసిన 500, 1000, 2000 రూపాయల నోట్లు సూట్కేసుల్లో కాకుండా లారీలు, కంటీనర్లలో కూడా వెళ్లాయని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందో.. సామాన్యుడికి న్యాయం జారుతుందో లేదో చూడాలి! నువ్వు సామాన్యుడివి అయితే.. గతంలో నీకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురై ఉంటే.. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతున్నట్టు నీకు ఎక్కడైనా కనిపిస్తే సోషల్ మీడియా వేదికగా నీ నిరసన ధైర్యంగా తెలియచేయి. పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యళ్లు తప్ప ! జై హింద్ అంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.