Home News వీర సింహరెడ్డి సెన్సార్ టాక్ వేరే లెవల్. మరి సంగతేంటి.?

వీర సింహరెడ్డి సెన్సార్ టాక్ వేరే లెవల్. మరి సంగతేంటి.?

నందమూరి వంశంలో ఆ సీనియర్ ఎన్టీఆర్ నట వారసునిగా సినిమాల్లోకి ప్రవేశించిన బాలయ్య ( బాలకృష్ట ) తనదైన శైలిలో తన నటనకు ప్రతిభకు తన స్టైల్లో క్రేజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను అందరూ ముద్దగా బాలయ్య బాబు అని పిలుచుకుంటూ జై బాలయ్య అని పొగుడుతుంటారు. ఇంకా అతని మిత్రులు, సన్నిహితులు బాల అని పిలుస్తుంటారు ఇటీవలే మనం చూసాం కదా అన్స్టాపబుల్లో బాలయ్య బాబు వాళ్ళ స్నేహితులతో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమా అంటే చాలు జనాల్లో, అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం ఉరకలెత్తిస్తుంది.  ఇక సంక్రాంతికి విడుదలకు సిద్దంగా ఉన్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి సెన్సార్ బోర్డు కూడా ఇచ్చిన వివరాల్లోకి వెలితే

See also  Chiranjeevi - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎనిమితో చిరంజీవి పార్టీ. జనసైనికులు రియాక్షన్స్ ఇదే..

సెన్సార్ బోర్డ్ కూడా ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగానే తెరకెక్కబోతుందని తెల్చి చెప్పడమే కాకుండా యూఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. అఖండ భారీ హిట్  సినిమా తరువాత వరుస చిత్రాల నడుమ బాలయ్య నటిస్తున్నాడు. అందులో గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రమే వీరసింహరెడ్డి ఇప్పటికే అన్ని కార్యక్రమాలను ముగించికున్న ఈ సినిమా సంక్రాంతితో మన ముందుకు రాబోతుంది. జనవరి 12 వ తారీకు  2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

See also  Harirama Jogaiah : పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య బాణం ఎలా ఉందంటే..

ఇటీవలే సూపర్ హిట్ అఖండ సొంత చేసుకున్న బాలయ్య, అలాగే క్రాక్ తో సూపర్ హిట్ గుంజుకున్న గోపిచంద్ మలినేని వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు వీరసింహరెడ్డి సినిమా రాబోతుంది అటు మాస్ ప్రేక్షకులకు ఇటు నందమూరి అభిమానులకు పండగో పండుగ అనే చెప్పాలి. పాటలు కూడా రిలీజై ఓ రేంజ్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సూపర్ డూపర్ అంచనాల నడుమ రిలీజ్ కావస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహస్ హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆ యాక్షన్ సీన్స్ ఆ డైలాగ్స్ కేక పుట్టిస్తున్నాయి. ట్రైలర్ ఏక్ ధమ్ హిట్ టాక్ సొంత చేసుకుందనే చెప్పాలి. ఆ ఊరమాస్ పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, ఆ ఛేజింగ్ లు బాలయ్య బాబు తర్వాతే ఎవరైనా అని చెప్పాలి అదిరిపోయాయి.

See also  Unstoppable with NBK: పవన్ కళ్యాణ్ ఒక్క ఎపిసోడ్ ద్వారా ఆహా మీడియా కి అన్ని కోట్లు వస్తాయా.

దర్శకుడు ఎక్కడ బోరింగ్ లేకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చిత్ర యూనిట్ లోని నిర్మాత సంస్ధల టాక్. ఐతే ముందుగా మూడు గంటల సమయం అనుకున్నప్పటికీ తదురది డైరెక్టర్ గోపిచంద్ ఎడిటర్లతో చర్చింది రన్ టైమ్ పది నిమిషాలు తగ్గించారని తెలుస్తుంది.